న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ బ్రిటిష్ ఏజెంట్, సుభాష్‌చంద్రబోస్ జపాన్ ఏజెంట్ అంటూ సుప్రీం కోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలను బుధవారం రాజ్యసభ తీవ్రంగా ఖండించింది. జీరో అవర్‌లో ప్రతిపక్షం సూచనపై సభ చైర్మన్ హమీద్ అన్సారీ చేసిన తీర్మానం మేరకు సభ పై విధంగా స్పందించింది. రాజ్యసభలో అధికార పార్టీ పక్ష నేత అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ గాంధీజీపై కట్జూ వ్యాఖ్యలు ప్రతిపక్షంతో పాటు అందరినీ బాధించాయన్నారు. మహ్మాతుడు ఈ శకానికే గొప్ప మనిషి అని ప్రశంసించారు. మన దేశానికి స్వాతంత్య్రాన్ని ఆర్జించి పెట్టడంలో ఆయన కృషి ఎంతో శ్లాఘనీయమన్నారు. కట్జూకు మాజీ న్యాయమూర్తి హోదాలో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ఉపసంహరించుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.