'నగ్నచిత్రాలు చూసి రెచ్చిపోవద్దు'
ఎప్పుడూ వివాదాల్లోనే ఉండే సుప్రీంకోర్టు మాజీ జడ్జి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ మార్కండేయ కట్జు ఈసారి మరో వివాదాస్పద అంశంపై స్పందించారు. రంజాన్ మాసంలో ముస్లింల సెంటిమెంట్లను దెబ్బతీసేందుకు రెచ్చగొట్టే ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారని, వాటిని చూసి రెచ్చిపోవద్దని ముస్లింలను కోరారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో రాసి, ఆ లింకును ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు. ఒక మహిళ తన బురఖాను పక్కకు తీసి, నగ్నంగా కాబా పైన నిల్చున్నట్లు ఒక ఫొటో సోషల్ మీడియాలో కనిపిస్తోందని ఆయన చెప్పారు.
మరో ఫొటోలో ఇద్దరు అమ్మాయిలు నగ్నంగా బీచ్‌లో పడుకుని ఉంటారని, దానికి 'ఇది రంజాన్. బికినీలు వేసుకోవద్దు' అనే కేప్షన్ పెట్టారని కట్జు తెలిపారు. ట్విట్టర్‌లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయని హెచ్చరించారు. ఇలాంటి ట్వీట్లు చూసి అనవసరంగా ఉద్రేకాలకు లోనుకావద్దని ముస్లింలను ఆయన కోరారు. ఇలాంటివాటిని పట్టించుకోకుండా వదిలేయాలని, కావాలనే కొంతమంది రెచ్చగొట్టడానికి ఇలా చేస్తుంటారని తెలిపారు.
Provocative pictures are being shown on Social Media to hurt Muslim sentiments during Ramzan. pic.twitter.com/BMXxUWB5Jv
— Markandey Katju (@mkatju) 10 June 2016