ramzan season
-
Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు... వాహనాలు మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. జమాతుల్ విదాగా పిలిచే రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో పాతబస్తీలోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో, నిర్ణీత సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందుకు ప్రముఖులు, ఆహూతులు భారీ సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. ఆయా సమయాల్లో సాధారణ వాహనచోదకులను ఏఆర్ పెట్రోల్ పంప్–బీజేఆర్ విగ్రహం–బషీర్‌బాగ్ మార్గాల్లోకి అనుమతించరు. చాపెల్ రోడ్, నాంపల్లి వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి మళ్లిస్తారు. వీటిని కంట్రోల్ రూమ్ వైపు అనుమతించరు. గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా, రవీంద్రభారతి, హిల్‌ఫోర్ట్ రోడ్ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను సుజాత హైస్కూల్ మీదుగా, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా మళ్లిస్తారు. నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద, కింగ్ కోఠి, బొగ్గులకుంట వైపు నుంచి భారతీయ విద్యా భవన్స్ మీదుగా వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి తాజ్ మహల్ హోటల్ మీదుగా మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాటిని లిబర్టీ మీదుగా పంపిస్తారు. జమాతుల్ విదా ప్రార్థనల నేపథ్యంలో... శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చార్మినార్–మదీన, చార్మినార్–ముర్గీ చౌక్, రాజేష్ మెడికల్ హాల్–శాలిబండ మధ్య ఎలాంటి వాహనాలను అనుమతించరు. వీటిని మదీన జంక్షన్, హిమ్మత్‌పుర, చౌక్ మైదాన్ ఖాన్, మోతీగల్లీ, ఈదీ బజార్ చౌక్, షేర్ బాటిల్ కమాన్, ఓల్డ్ కమిషనర్ కార్యాలయం చౌరస్తాల నుంచి అవసరాన్ని బట్టి మళ్లిస్తారు. ప్రార్థనలకు హాజరయ్యే వారి కోసం గుల్జార్ ఫంక్షన్ హాల్, ముఫీదుల్ అమాన్ గ్రౌండ్స్, చార్మినార్ బస్ టెర్మినల్, ఆయుర్వేదిక్ యునానీ హాస్పిటల్, ఖిల్వత్ గ్రౌండ్స్, చౌమొహల్లా ప్యాలెస్ ఎదురుగా ఉన్న ఓల్డ్ పెన్షన్ ఆఫీస్, సర్దార్ మహల్‌ల్లో (ఇక్కడ కేవలం విధుల్లో ఉన్న అధికారుల వాహనాలు) పార్కింగ్ సదుపాయం కల్పించారు. సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగే ప్రార్థనల నేపథ్యంలో మహంకాళి పోలీసుస్టేషన్ నుంచి రామ్‌గోపాల్ పేట్ రోడ్ జంక్షన్ మధ్య మార్గాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసేస్తారు. బాటా చౌరస్తా నుంచి సుభాష్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను లాలా టెంపుల్ మీదుగా పంపిస్తారు. ఈ మళ్లింపులు ఆర్టీసీ బస్సులకు సైతం వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: ట్విట్టర్లో పెట్రో వార్ !) -
ఇఫ్తార్ విందుకు సర్వం సిద్ధం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పవిత్ర రంజూన్ మాసాన్ని పురస్కరించుకుని నేడు (బుధవారం) ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టేడియంలో ఏర్పాట్లను డిప్యూటీ సీఎం, మైనారిటీశాఖ మంత్రి అంజద్‌బాషా మంగళవారం ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎండీ రుహుల్లా, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని హాజరుకావాలని కోరారు. ఎనిమిది వేల మంది ముస్లిం సోదరులకు పాస్‌లు అందజేస్తామన్నారు. స్టేడియం వాటర్ ట్యాంక్ వైపు గేటు నుంచి సాధారణ ప్రజలకు, బందరు రోడ్డు వైపు ప్రధాన గేటు నుంచి వీఐపీలకు ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. ఇఫ్తార్ విందు కోసం మైనారిటీ సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.80 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ వన్‌టౌన్‌లో రూ.15 కోట్లతో నిర్మించిన ముసాఫిర్ ఖానాను సీఎం బుధవారం ప్రారంభిస్తారని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ జి.సూర్యసాయిప్రవీణ్ చంద్, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. -
హలీమ్‌కు సలాం
రంజాన్ మాసం వచ్చిందంటే చాలు..ముస్లిం సోదరుల ఉపవాసదీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు మాత్రమే కాదు. హైదరాబాద్ సంప్రదాయక వంటకమైన హలీం గుర్తుకువస్తుంది. ఒకప్పుడు కేవలం అక్కడికే పరిమితమైన ఈ వంటకం మెల్లమెల్లగా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం హలీం తయారీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఉపవాసదీక్షలు జరిగే నెలరోజులు పాటు ముస్లిం సోదరులే కాకుండా సాధారణ జనాలు సైతం ఈ రుచికి సలాం అంటున్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటైన హలీం కేంద్రాలపై ప్రత్యేక కథనం. –మదనపల్లె సిటీ / రాయచోటిటౌన్ / రాజంపేటటౌన్ హలీం వంటకం అరబ్ దేశమైన పర్షియా నుంచి హైదరాబాదుకు చేరుకుంది. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్షల్లో ఇఫ్తార్‌కు తయారుచేసే ప్రత్యేక వంటకం గురించి ప్రస్తావించారు. వెంటనే నవాబు షాహీ దస్తర్ ఖానా సిబ్బందిని పిలిపించి దానిని సిద్ధం చేయించారు. అదే హలీం. పర్షియా నుంచి పరిచయమై.. హైదరాబాదు మీదుగా నేడు అన్ని ప్రాంతాల్లో లొట్టలేసుకుంటూ ఆరగించే రంజాన్ వంటకంగా గుర్తింపు పొందింది. ’తయారీ ప్రత్యేకమే.... సంప్రదాయక వంటలతో పోలిస్తే హలీం తయారీ ఆద్యంతం ప్రత్యేకమే. దీనికి కనీసం 9 గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్ లేదా చికెన్, గోధుమలు, అన్ని పప్పులు, బాస్మతిబియ్యం, నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రైఫ్రూట్స్ తదితర వస్తువులను వినియోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, బాస్మతిబియ్యం, పప్పులు, అల్లంవెల్లుల్లిపేస్ట్, మసాలాదినుసులు, పచ్చిమిర్చి బాగా ఉడికించి మెత్తగా దంచుతారు. సమపాళ్లలో నెయ్యి కలుపుతారు. వేడివేడిగా వేయించిన ఉల్లిపాయలు, నిమ్మ ముక్కతో పింగాణీ ప్లేటులో వడ్డిస్తారు. చికెన్ హలీంను హరీస్గా పిలుస్తారు. హలీం రుచికే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఒక కప్పు హలీంలో 365 క్యాలరీలు, కొవ్వు నుంచి లభించే క్యాలరీలు 150 లభిస్తాయి. హలీం కొనుగోలుకు ఆసక్తి కనపరుస్తున్న ప్రజలు ► మదనపల్లెలోని బెంగళూరు బస్టాండులో జామియా మసీదు సమీపంలో రంజాన్ ప్రార్థనలకు వచ్చే ముస్లింసోదరులకు అందుబాటులో ఉండేలా 5 హలీం కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిల్లో రుచికరమైన చికెన్హలీం రూ.100కు, మటన్ హలీం రూ.150కు లభిస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ► రాజంపేటలోని ఆర్ఎస్రోడ్, మెయిన్‌రోడ్లలో హలీంసెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక బాక్స్ రూ.200 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నారు. రాయచోటిలో మొత్తం 13 హలీం సెంటర్లు ఉన్నాయి.ట్రంక్ సర్కిల్, దర్గా, బంగ్లా జుమ్మమసీదువద్ద, మదనపల్లెరోడ్డు, రవి, లక్ష్మీ హాల్ సమీపంలో, ఎస్ఎన్ కాలనీ తదితతర ప్రాంతాల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మటన్‌తో కూడిన హలీం 250 గ్రాములు కప్పు రూ.200, చికెన్‌తో వండిన హరీన్ కప్పు రూ.110, హాప్ రూ.60లుగా విక్రయిస్తున్నారు. ’రుచి అమోఘం.... రంజాన్ మాసంలో దొరికే హలీం రుచి అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెట్టగానే మెత్తగా, రుచిగా అనిపించే ఈ వంటకం ఆరోగ్యానికి ఉపయోగకరమని వైద్యులు చెప్పడంతో ప్రతి సంవత్సరం కచ్చితంగా తినడాన్ని అలవాటు చేసుకున్నాను. గతంలో హైదరాబాదుకు ఎవరైనా వెళితే వారితో ప్రత్యేకంగా తెప్పించుకునే వాడిని. ఇప్పుడు ఇక్కడే దొరుకుతుండటంతో ప్రతిరోజు సంతోషంగా ఆరగిస్తున్నాను. – మహమ్మద్‌ఖాన్, టీచర్, మదనపల్లె. ’క్వాలిటీలో రాజీపడకుండా తయారీ.. హలీం వంటకంపై ఆహారప్రియులకు ఓ విశేషమైన అభిప్రాయం ఉంది. వారి అంచనాలకు తగ్గట్లుగా హలీంను తయారుచేస్తేనే ఆదరణ ఉంటుంది. అందుకే తయారీలో ఏమాత్రం రాజీపడకుండా నాణ్యమైన దినుసులను, స్వచ్ఛమైన పదార్థాలను వాడుతూ ప్రజలకు నాణ్యమైన వంటకాన్ని అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పుడిప్పుడే పట్టణ ప్రజలు దీనిపై మక్కువ చూపడమే కాకుండా ఆహారంగా తీసుకునేందకు ఆసక్తి కనపరుస్తున్నారు. – చాంద్‌బాషా, షాన్ కేటరింగ్, మదనపల్లె. హైదరాబాద్ నుంచి రప్పించాం హలీం రుచికి ఉన్న పేరును దృష్టిలో ఉంచుకొని దీని తయారీ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వంటమాస్టర్లను రప్పించాం. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారికి పోషక ఆహారమైన హలీంను రుచిగా, నాణ్యతగా అందించాలన్నదే ప్రధాన ఉద్దేశం. అందువల్ల టేస్ట్ విషయంలో ఎక్కడ కూడా రాజీపడటం లేదు. – షామీర్, వ్యాపారి,రాజంపేట శక్తివంతమైన ఆహారం హలీం శక్తివంతమైన ఆహారం. మాంసంతో పాటు అనేక రకాల పప్పుదినుసులతో తయారు చేయడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న వారికి హలీం మంచి శక్తిని ఇస్తుంది. – డాక్టర్ అశ్విన్‌చంద్ర, ఆకేపాడు పీహెచ్సీ, రాజంపేట మండలం -
మాస్క్ ఉంటేనే మసీదులోకి..
చార్మినార్: ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభం అయింది. మంగళవారం రాత్రి మక్కా మసీదులో ఇషాకి నమాజ్ నిర్వహించారు. అనంతరం మక్కా మసీదు కతీబ్ రిజ్వాన్ ఖురేషీ తరావీ పవిత్ర ఖురాన్‌ను పఠించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో మక్కా మసీదును అలంకరించారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు సందర్భంగా ముస్లింలకు నెల రోజుల పాటు పంపిణీ చేయడానికి వెయ్యి కిలోల ఖర్జూరం సిద్ధం చేశామని మక్కా మసీదు సూపరింటెండెంట్ ఎం.ఎ.ఖాదర్ సిద్దిఖీ అన్నారు. ►ప్రతి రోజు పంపిణీ చేయడానికి 100 డజన్ల అరటి పండ్లను మైనార్టీ సంక్షేమ శాఖ మంజూరు చేసిందన్నారు. ►కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మక్కా మసీదులో నిర్వహించే సామూహిక ప్రార్థనల్లో పాల్గొనే ముస్లింలు విధిగా మాస్క్ ధరించాలని సూచించారు. ►మసీదుకు వచ్చేవారు తమ ఇళ్ల వద్దే వజూ చేసుకొని వెంట జానిమాజ్లు తెచ్చుకోవాలన్నారు. ►మాస్క్‌లు ధరించకపోతే.. పోలీసులు మక్కా మసీదు లోనికి అనుమతించరని స్పష్టం చేశారు. ►60 ఏళ్లు పైబడిన వారితో పాటు 10 ఏళ్ల లోపు చిన్నారులు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన రాదని కోరారు. ►మక్కా మసీదులోకి విజిటర్స్‌కు అనుమతి లేదని.. నమాజులు, ఇఫ్తార్లు, తరావీలను భౌతికదూరం పాటిస్తూ నిర్వహించుకోవాలన్నారు. ( చదవండి: ఉపవాసం ఉండి వ్యాక్సిన్ తీసుకోవచ్చు) -
ఎలా తెలిసింది?
రాజుగారు అడవిలో షికారు కోసం గుర్రాన్ని వేగంగా దౌడు తీయిస్తున్నారు. వేట ధ్యాసలో పడి దారిని, సమయాన్ని కూడా మర్చిపోయినట్లున్నారు. వెనక్కి తిరిగి చూస్తే కనుచూపు మేరలో సైనికులెవ్వరూ లేరు. చుట్టూ చీకటి కమ్ముకుంటోంది. దానికితోడు వర్షపు జల్లులు కూడా మొదలయ్యాయి. తలదాచుకునే ప్రయత్నంలో చుట్టూ చూశారు. అల్లంత దూరాన ఓ పూరిగుడిసెలోనుంచి దీపపు కాంతులు కనబడుతున్నాయి. పాదుషాకు ప్రాణం లేచివచ్చినట్లయింది. వెంటనే ఆ గుడిసె ముందు ప్రత్యక్షమయ్యారు. గుడిసెలో ఒకామె కూర్చుని కూరగాయలు తరుగుతోంది. ఆ ముసలావిడ ముందు అణకువతో నిలబడి ఈ ఒక్కరాత్రి తలదాచుకుంటానని ప్రాధేయపడ్డారు. ఆవిడ పెద్దమనసుతో అతన్ని ఇంట్లోకి పిలిచింది. మరికాసేపటికి ఆ పెద్దమ్మ కూతురు ఆవుల మందను తోలుకుని ఇంటికి వచ్చింది. రోజంతా ఆవులను మేపి అలసిపోయిన ఆ అమ్మాయి ఇంట్లోకి రాగానే మంచంపై మేను వాల్చింది. మేలుజాతి రకం ఆవులు... అందులోనూ పొదుగు నిండుగా ఉన్న ఆవులను పాదుషా ఇదివరకెప్పుడూ చూడలేదేమో! ఎలాగైనా ఈ ఆవుల మందపై పన్ను విధించి, వాటి పాలను రోజూ దర్బారుకు తెప్పించుకోవాల్సిందేననే దుర్బుద్ధి పుట్టింది. అంతలోనే ఆ పెద్దావిడ తన కూతురితో ‘అమ్మా ఆవుపాలు పిండి కాచి తీసుకురా! పాదుషా గారికి వేడి వేడి పాలు ఇద్దాం’’ అని చెప్పింది. ఆ అమ్మాయి ఆవుపాలు పిండేందుకు వెళ్లగా పొదుగులోనుంచి చుక్క పాలు కూడా రాలేదు. ‘‘అమ్మా నాకేదో కీడు శంకిస్తోంది’’ అని పెద్దగా కేకవేస్తూ చెప్పింది అమ్మాయి.. ముసలావిడ ఏమైందో ఏమోనని కంగారుగా వెళ్లింది. ‘‘అమ్మా కాసేపటి క్రితం వరకూ పాలతో పొదుగు నిండుగా ఉంది. ఇప్పుడేమో పాలు పిండుతుంటే చుక్క కూడా రావడం లేదు’’ అని ఆందోళనగా చెప్పింది. ‘‘ఈ రాత్రికి వదిలేయ్. తెల్లారాక చూద్దాం’’ అని కూతురికి నచ్చచెప్పింది. తల్లీకూతుళ్ల మాటలు వింటున్న పాదుషా వెంటనే తన మనసులోని పన్ను కట్టించాలన్న ఆలోచనను విరమించుకున్నాడు. ఆ రాత్రి అలసటతో నిద్రలోకి జారుకున్నాడు.‘‘అమ్మా ఇప్పుడు పాలు పితుకు’’ అని తన కూతురికి చెప్పింది ఆ ముసలావిడ. ఆ అమ్మాయి ఆవు పొదుగు పిండగానే పాలు పుష్కలంగా వచ్చాయి. రోజూలాగే నాలుగు చెంబులూ పాలతో నిండిపోయాయి. రాజుగారు వేడి వేడి పాలను సేవించారు. ఎంతో రుచికరంగా ఉన్నాయని కితాబు కూడా ఇచ్చారు. అంతలోనే సైన్యం పాదుషాను వెతుక్కుంటూ పూరిగుడిసెలో ప్రత్యక్షమయ్యింది.మర్నాడు పాదుషా ఆజ్ఞమేరకు తల్లీకూతుళ్లను దర్బారుకు తీసుకొచ్చింది సైన్యం. వారికి దగ్గరుండి అతిథి మర్యాదలు చేశాడు పాదుషా. ఆ తరువాత ఆ పెద్దామెను ‘ఆ రోజు నా మనసులో దుర్బుద్ధి కలిగిన విషయం మీకెలా తెలిసింది’ అని అడిగారు కుతూహలంగా. ‘రాజదర్బారు నుంచి న్యాయపరమైన నిర్ణయాలు జరిగిన ప్రతీసారి పల్లెటూళ్లల్లో, అడవుల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రజలంతా హాయిగా ఉంటారు. ఏదైనా దౌర్జన్యపూరితమైన నిర్ణయం జారీ అయినప్పుడు మాత్రం లాభాల స్థానంలో నష్టాలు వస్తాయి. ఇదే సంకేతం. ఎప్పుడు ఎలాంటి ఆదేశాలు జారీ అయ్యాయో ఇట్టే పసిగట్టగలుగుతాము.’’ ఈ మాటలు విన్న పాదుషా నోరెళ్లబెట్టాడు. తల్లీ కూతుళ్లను మెచ్చుకుని సత్కరించి బహుమానాలిచ్చి పంపాడు. – అబ్దుల్ మలిక్ -
పట్టరాని కోపం
చాలా రోజుల తర్వాత కొత్త బట్టలు ధరించే అవకాశం ఇచ్చిన అల్లాహ్ కు కృతజ్ఞతలు చెప్పుకొని నమాజ్ కోసం మసీదుకు వెళుతున్నాడు ఒక వ్యక్తి. అసలే తెల్లని బట్టలు. ఎక్కడ మట్టి అంటుకుంటుందోనని చాలా జాగ్రత్తగా నడుస్తున్నాడు.దారిలో ఆడుకుంటున్న పిల్లాడు రాయి విసిరాడు. అది కాస్తా పక్కనే ఉన్న బురదలో పడి దాని చిందులు అటుగా వెళ్తున్న ఆ వ్యక్తి తెల్లని దుస్తులపై పడ్డాయి. ఆ వ్యక్తికి కోపం నషాళానికి ఎక్కింది. పట్టరాని ఆగ్రహంతో ఆ కుర్రాడి మీదకు పరిగెత్తాడు.అంతలో ‘‘కోపం సైతాన్ ప్రేరణతో వస్తుంది. నిలబడి ఉండగా కోపం వస్తే వెంటనే కూర్చోండి. కూర్చోని ఉండగా కోపం వస్తే వెంటనే పడుకోండి’’ అన్న ప్రవక్త ముహమ్మద్ గారి ప్రవచనం గుర్తుకు వచ్చింది. ఆ వ్యక్తి వెంటనే ఆ బురదలో కూర్చున్నాడు. కోపం తగ్గలేదు. వెంటనే బురదలో పడుకున్నాడు.బట్టలు పాడైతే మళ్లీ కొనుక్కోవచ్చు. కాని సైతాన్ కోపంలో ఏదైనా చెయ్యరాని పని చెయిస్తే. శాశ్వతమైన స్వర్గానికి దూరం కావాల్సి ఉంటుంది.కుస్తీ పట్టి ఇతరుల్ని చిత్తు చేసేవాడు అసలైన శూరుడు కాడు. తనకు ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపే వాడే వాస్తవానికి ధీరుడు. అన్నారు ప్రవక్త (స).ఉపవాసాల అసలు ఉద్దేశం దైవభీతి జనింపజేయడం. సహన గుణం అలవర్చకోవడం.ఈ నెల రోజుల ఉపవాస దీక్షలు మనలో కోపాన్ని అదుపు చేసే గుణం అలవర్చకోగలిగే వారు నిజంగా అదృష్టవంతులు. – షేక్ అబ్దుల్ బాసిత్ -
సైతాన్ ఉన్న చోట
అబూబక్ర్ సిద్దీఖ్ (ర) ప్రవక్త ముహమ్మద్ (స) యొక్క అత్యంత ప్రియమైన మిత్రుడు. ఒకసారి ఆయన ప్రవక్త (స) తో పాటు ఇతర సహచరుల సన్నిధిలో కూర్చుని ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (ర) ను అనరాని మాటలు అంటున్నాడు. హజ్రత్ అబూబక్ర్ మౌనంగా వింటూన్నాడు. ప్రవక్త ముహమ్మద్ ( స) ఆ దృశ్యాన్ని చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతూన్నారు. ఆ వ్యక్తి లేనిపోని నిందలు వేస్తూ, ఇంకా ఏదేదో అంటుంటే, అబూబక్ర్ సహనం కోల్పోయి సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేసరికి, అప్పటి దాకా చిరునవ్వు నవ్వుతూ కూర్చున్న ప్రవక్త ముహమ్మద్ (స) అక్కడి నుండి లేచి వెళ్లిపోయారు.కాసేపటికి హజ్రత్ అబూబక్ర్, ప్రవక్త మహనీయుల వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్త ముహమ్మద్ (స)! ఆ వ్యక్తి నన్ను అనరాని మాటలు అంటుంటే మీరు ముసిముసిగా నవ్వుతూ కూర్చున్నారు. నేను వాడికి సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేసరికి మీరు లేచి వెళ్లిపోయారేమిటీ?’’ అని అడిగాడు.‘‘నిన్ను ఆ వ్యక్తి దూషిస్తున్నప్పుడు దైవదూతలు నీకు బదులుగా సమాధానం ఇస్తున్నారు. అది చూసి నేను నవ్వుతూ వింటున్నా. నీవు అతనికి సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేసరికి దైవదూతలు అక్కడ నుండి నిష్క్రమించారు. సైతాన్ మీ మధ్యలోకి వచ్చాడు. సైతాన్ ఉన్న చోట నేను ఉండలేను కదా. అందుకే అక్కడి నుంచి వచ్చేసాను’’ అని చెప్పారు.దూషణలకు దూషణ సమాధానం కారాదు. అలాంటి ఇద్దరి మధ్య సైతాన్ దూరి తన పని కానిస్తాడు. ఇద్దరి మధ్య వైరం రగిలించి, శత్రుత్వాన్ని పెంపొందించే పని చేస్తాడు. ఇంకా వారు ఒకరినొకరు ద్వేషించుకుంటూ, తమ సమయాన్ని చెడు పనులకు వినియోగిస్తారు. అందుకే ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. ‘ఓ ప్రవక్తా(స) మంచి చెడు ఒకటి కాదు. చెడును అతి శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించడానికి ప్రయత్నం చేయి. నీ ప్రాణ శత్రువు సైతం నీ ప్రాణ స్నేహితుడై పోవడం నీవు చూస్తావు. కాని ఈ అదృష్ట యోగ్యం అందరికీ సాధ్యం కాదు’ అని.ఇలాంటి సహన గుణం అలవరచుకోవడం కోసమే రంజాన్ మాసంలో నెలరోజుల ఉపవాస దీక్షతో శిక్షణ పొందేలా చేస్తుంది ఇస్లాం.‘మీరు ఉపవాసం పాటిస్తున్నప్పుడు, ఎవరైనా తిట్టినా లేదా జగడానికి దిగినా.. నేను రోజూ పాటిస్తున్నాను అని సమాధానం ఇవ్వండి’ అని ప్రవక్త (స )తెలిపారు. అంటే మీరు ద్వేషించే వారిని ఉపవాస దీక్ష ద్వారా ప్రేమించడం అలవర్చుకోవాలి. – షేక్ అబ్దుల్ బాసిత్ -
'నగ్నచిత్రాలు చూసి రెచ్చిపోవద్దు'
ఎప్పుడూ వివాదాల్లోనే ఉండే సుప్రీంకోర్టు మాజీ జడ్జి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ మార్కండేయ కట్జు ఈసారి మరో వివాదాస్పద అంశంపై స్పందించారు. రంజాన్ మాసంలో ముస్లింల సెంటిమెంట్లను దెబ్బతీసేందుకు రెచ్చగొట్టే ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారని, వాటిని చూసి రెచ్చిపోవద్దని ముస్లింలను కోరారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ పేజీలో రాసి, ఆ లింకును ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. ఒక మహిళ తన బురఖాను పక్కకు తీసి, నగ్నంగా కాబా పైన నిల్చున్నట్లు ఒక ఫొటో సోషల్ మీడియాలో కనిపిస్తోందని ఆయన చెప్పారు. మరో ఫొటోలో ఇద్దరు అమ్మాయిలు నగ్నంగా బీచ్‌లో పడుకుని ఉంటారని, దానికి 'ఇది రంజాన్. బికినీలు వేసుకోవద్దు' అనే కేప్షన్ పెట్టారని కట్జు తెలిపారు. ట్విట్టర్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయని హెచ్చరించారు. ఇలాంటి ట్వీట్లు చూసి అనవసరంగా ఉద్రేకాలకు లోనుకావద్దని ముస్లింలను ఆయన కోరారు. ఇలాంటివాటిని పట్టించుకోకుండా వదిలేయాలని, కావాలనే కొంతమంది రెచ్చగొట్టడానికి ఇలా చేస్తుంటారని తెలిపారు. Provocative pictures are being shown on Social Media to hurt Muslim sentiments during Ramzan. pic.twitter.com/BMXxUWB5Jv — Markandey Katju (@mkatju) 10 June 2016