అనంతమూర్తికి కన్నీటి వీడ్కోలు | Jnanpith award winner UR Ananthamurthy passes away | Sakshi
Sakshi News home page

అనంతమూర్తికి కన్నీటి వీడ్కోలు

Published Sun, Aug 24 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM

అనంతమూర్తికి కన్నీటి వీడ్కోలు

అనంతమూర్తికి కన్నీటి వీడ్కోలు

కర్ణాటక సీఎం సహా వేలాది మంది నివాళి
 సాక్షి ప్రతినిధి, బెంగళూరు: జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ యూఆర్ అనంతమూర్తి(82)కి శనివారం సాయంత్రం ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బెంగళూరు విశ్వ విద్యాలయం ప్రాంగణంలోని కళాగ్రామలో 15 మంది పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ బ్రాహ్మణ సంప్రదాయానుసారం అనంతమూర్తి చితికి ఆయన కుమారుడు డాక్టర్ శరత్ నిప్పు పెట్టారు. అంతకుముందు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతమూర్తి భార్య ఎస్తేర్, కుమార్తె అనురాధ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సాహితీ వేత్తలు, పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. తీవ్ర అనారోగ్యంతో అనంతమూర్తి శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement