Jnanpith Award
-
పైజామా జేబులో బొంగరం
‘అర్ధరాత్రి సమయం. అమ్మ నగలన్నీ వేసుకుంది. తక్కినవి మూట కట్టుకుంది. నాకంటే ఆరేళ్లు చిన్నది చెల్లెలు. దానికి పాలు బాగా తాగించి భుజాన వేసుకుంది. నేను మాత్రం నాకున్న ఒకే ఒక ఆస్తి బొంగరాన్ని నా పైజామా జేబులో పెట్టుకున్నాను. అందరం కాందిశీకులంగా మారి ఆవలి సరిహద్దుకు బయలుదేరాం. చీకటి. భీతి గొలుపుతున్న అరణ్యమార్గం. అందరి కళ్లు చీమ చిటుక్కుమన్నా రెప్పలు విప్పార్చి భయంతో, కోపంతో మొరిగినట్టుగా చూస్తున్నాయి. నడిచాం.. నడిచాం.. అమ్మ రక్తపు వాంతి చేసుకుంది. చెల్లి భుజం నుంచి జారి మట్టిలో కలిసిపోయింది. నేను నా బాల్యాన్ని అక్కడే భూస్థాపితం చేసి ఇటువైపుకు చేరుకున్నాను’... గుల్జార్ కవిత ఇది. దేశ విభజన సమయంలో అతనికి పన్నెండు పదమూడేళ్లు ఉంటాయి. నేటి పాకిస్తాన్ లోని జీలం నుంచి వాళ్ల కుటుంబం ఢిల్లీకి చేరుకుంది. రెఫ్యూజీ క్యాంప్‌లో గుల్జార్ బాల్యం గడిచింది. ఇక్కడకొచ్చాక కూడా వీళ్లుంటున్న రోషనారా రోడ్, సబ్జీమండీల్లో నరమేధాన్ని చూశాడు. ‘మా స్కూల్లో రోజూ ప్రేయర్ చదివే కుర్రాణ్ణి చంపారు’ అంటాడు. ‘సబ్జీమండీలో శవాల మీద పాత కుర్చీలు, విరిగిన మంచాలు వేసి తగలబెట్టడం చూశాను’ అంటాడు. ‘ఇరవై ముప్పై ఏళ్లు అవే పీడకలల్లో వెంటేడేవి’ అని వగస్తాడు. సిక్కులు కష్టజీవులు. గుల్జార్ తండ్రి టోపీలు, చేతిసంచుల దుకాణం తెరిచాడు. పాకిస్తాన్ నుంచి వచ్చిన సిక్కులు ‘మా ఊరివాడు ఒక్కడు కనిపించినా చాలు’ అని వెతుక్కుంటూ తిరిగేవారు. కొందరు గుల్జార్ తండ్రి దగ్గరకు వచ్చి గుల్జార్ వాళ్ల ఇంట్లోనే తల దాచుకునేవారు. ‘మా ఇల్లే ఒక రెఫ్యూజీ క్యాంప్‌గా మారింది. నాకు పడుకోవడానికి చోటే లేదు’ అని చెప్పుకున్నాడు గుల్జార్. ఇదీ ఒకందుకు మంచిదే అయ్యింది. గుల్జార్‌కు కరెంటు లేని స్టోర్‌రూమ్ ఇవ్వబడింది. ఒకడే కుర్రవాడు.. తోడుగా లాంతరు. వీధి చివరకు వెళ్లి పావలా ఇస్తే వారంలో ఎన్ని పుస్తకాలైనా అద్దెకు తెచ్చుకోవచ్చు. అలా గుల్జార్ పఠనం స్టోర్‌రూమ్‌లో లాంతరు కింద మొదలైంది. ‘ఒకరోజు ఒక పుస్తకం అద్దెకు తెచ్చుకున్నాను. అది ఇంతకుముందు చదివిన పుస్తకాల వలే లేదు. చదివాను. మరసటి రోజు అదే రచయిత రాసిన మరో పుస్తకం చదివాను. భలే అనిపించింది. ఆ తర్వాత ఆ రచయిత సెట్ అంతా ఉర్దూలో ఉంటే తెచ్చుకుని చదివాను. దారీ తెన్నూ లేని ఒక కాందిశీక పిల్లవాడి జీవితాన్ని మార్చడానికే బహుశా ఆ రచయిత నాకు తారసపడ్డాడేమో. అతని పేరు రవీంద్రనాథ్ టాగోర్’ అంటాడు గుల్జార్. ఇంటి నిండా కాందిశీక బంధుమిత్రులు ఉండిపోవడంతో గుల్జార్‌కు జరిగిన మరో మంచి బొంబాయిలో ఉన్న సోదరుడి దగ్గర ఉండమని తండ్రి పంపించడం. అక్కడే గుల్జార్ సొట్టలుపోయిన కార్లకు పెయింట్ వేసే పని మొదలెట్టాడు. అప్పటికే అతడికి రంగులు తెలుసు. బొమ్మలు తెలుసు. కవిత్వంలోని పదచిత్రాలు తెలుసు. ‘ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ’ (పి.డబ్బ్యు.ఏ) వారాంతపు మీటింగ్‌లకు వెళ్లి కవిత్వం చదివితే సినీకవి శైలేంద్ర మెచ్చుకుని బిమల్ రాయ్‌కు పరిచయం చేశాడు. ‘కార్లకు పెయింట్ వేయడం కంటే సినిమాల్లో రాస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి’ అని బిమల్ రాయ్ ‘బందిని’లో మొదటి పాట రాయించాడు– ‘మోర గోర అంగ్ లైలె’. తర్వాత గుల్జార్ హృషీకేశ్ ముఖర్జీకి ప్రధాన అనుచరుడయ్యాడు. ఆ తర్వాత సాగిందంతా గుల్జార్ జైత్రయాత్ర. గుల్జార్ కవి, రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, సినీ కవి, మాటల రచయిత, దర్శకుడు. అనువాదకుడు, బాలల రచయిత, టెలివిజన్ డైరెక్టర్... ‘హర్ ఫన్ మౌలా’. సకల కళాకోవిదుడు. ‘నేను నా దేశవాసుల మనోఫలకం మీద కవిగా మిగలాలని కోరుకుంటున్నా’ అని అభిలషిస్తాడు గుల్జార్. అయితే మన దేశంలో పాప్యులర్ కల్చర్‌లో ఉన్న వ్యక్తి సీరియస్ సాహిత్యంలో ఎంత పని చేసినా ఎంతో ఎరుకతో వ్యవహరిస్తే తప్ప సాహిత్యముద్రను ముందువరుసలో పొందలేడు. గుల్జార్ సాహిత్యకృషి కంటే అతని సినిమా కృషే ఎప్పుడూ ముందుకొస్తూ ఉంటుంది. గుల్జార్ కవిత్వానికి ఉన్న పాఠకుల కంటే అతని సినిమా పాటలకు ఉన్న శ్రోతలు విస్తారం కావడమే కారణం. చిత్రమేమిటంటే గుల్జార్‌కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ వచ్చినప్పుడు ఆనందించినవారు ఎందరో మొన్న ‘జ్ఞానపీఠ్’ ప్రకటించినప్పుడు సంతోషించినవారు అందరు. ఇలా ‘దాదాసాహెబ్’, ‘జ్ఞానపీఠ్’ రెండూ అందుకున్న సృజనమూర్తి మన దేశంలో ప్రస్తుతానికి మరొకరు లేరు. ‘ఎప్పుడైనా ఒంటరిగా కూచుని నా కవిత్వం మొత్తం చూసుకున్నప్పుడు ఇందులో ఇంత ఉదాసీనత ఎందుకుందా అని బెంగటిల్లుతాను’ అంటాడు 90 ఏళ్లకు సమీపిస్తున్న గుల్జార్. జీవితాన్ని, ప్రేమను, మానవీయ అనుబంధాలను, ప్రకృతి ప్రదర్శించే ఐంద్రజాలంలో పొందగల ఆనందాలను... ఊరటను, చిన్నచిన్న ఫిర్యాదులను, పెద్దపెద్ద సర్దుబాట్లను రాస్తూ వచ్చిన గుల్జార్ ఈ దేశపు వర్తమాన ముఖచిత్రాన్ని అనునిత్యం న్యూస్పేపర్లలో చూసి ఉదాసీనత చెందుతూనే ఉంటాడు. మరల మరల ప్రేమను పంచాల్సిన సంకల్పాన్ని పొందుతూనే ఉంటాడు. కత్తులు నిద్రలేచే రాత్రులు మరోమారు దేశంలో అరుదెంచకూడదని కలవరపడే గుల్జార్, పైజామా జేబులో బొంగరాన్ని దాచుకుని బుగ్గలపై కన్నీటి చారికలతో మిగిలిన మరో బాలుడి గాథ ఈ దేశం భవిష్యత్తులో వినరాదని దుఆ చేస్తాడు. హిందీని, ఉర్దూను కలిపి తాను మాట్లాడేభాషను ‘హిందూస్తానీ’గా పేర్కొనే గుల్జార్ తన పేరుకు తగ్గట్టు ఈ హిందూస్తాన్ ఒక పూలతోటై విరబూయాలని, సుగంధాలను వెదజల్లుతూనే ఉండాలని కలంతో సందేశాలను పంపుతూనే ఉంటాడు. -
Jnanpith Awards 2023: గుల్జార్, రామభద్రలకు జ్ఞానపీఠ్
న్యూఢిల్లీ: ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ప్రతిష్టాత్మక 58వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ శనివారం ఈ విషయం వెల్లడించింది. 2023వ సంవత్సరానికి గాను ఈ ఇద్దరు ప్రముఖులకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేసింది. 2022వ సంత్సరానికి గాను గోవా రచయిత దామోదర్ మౌజోకు జ్ఞానపీఠ్ లభించింది. ప్రసిద్ధ బాలీవుడ్ సినీ రచయిత, ఉర్దూ కవి సంపూరణ్ సింగ్ కాల్రా అలియాస్ గుల్జార్(89)ను ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వరించాయి. 2002లో సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు. 2013లో దాదాసాహెబ్ ఫాలే్క, 2004లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఐదు సార్లు జాతీయ ఫిలిం అవార్డు పొందారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, మాచీస్, ఓంకారా, దిల్ సే, గురు వంటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. స్లమ్‌డాగ్ మిలియనీర్‌లోని ‘జై హో’ పాటకు 2009లో ఆస్కార్ అవార్డు దక్కింది. బహుముఖ ప్రజ్ఞాశాలి రామభద్రాచార్య ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన జగద్గురు రామభద్రాచార్య(74) మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో తులసీ పీఠాన్ని స్థాపించారు. రామానంద ప రంపరలో ప్రస్తుతం ఉన్న నలుగురు జగద్గురువుల్లో ఆయన కూడా ఒకరు. రెండు నెలల వయసులో ఇన్ఫెక్షన్ వల్ల కంటి చూపు కోల్పోయారు. ఐదేళ్ల వయసులోనే భగవద్గీతను, ఎనిమిదేళ్ల వయసులో రామచరితమానస్‌ను కంఠస్తం చేశారు. రామభద్రాచార్య బహు ముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. 22 భాషల్లో మాట్లాడగలరు. సంస్కృతం, హిందీ, అవ«దీ, మైథిలీ తదితర భాషల్లో రచనలు చేశారు. 240కిపైగా పుస్తకాలు రాశారు.2015లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. -
మలయాళ కవి అక్కితమ్‌కు జ్ఞానపీఠ్
న్యూఢిల్లీ: ప్రముఖ మలయాళ కవి అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. అక్కితమ్‌ను 55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు ఎంపిక కమిటీ శుక్రవారం ప్రకటించింది. ‘అక్కితమ్ అరుదైన సాహితీవేత్త. కలకాలం నిలిచిపోయే ఎన్నో రచనలు చేశారు. ఆయన కవిత్వం అపారమైన కరుణను ప్రతిబింబిస్తుంది. భారతీయ తాత్వికత, నైతిక విలువలకు, సంప్రదాయం, ఆధునికతకు వారధిగా ఆయన కవిత్వం నిలుస్తుంది. వేగంగా మారుతున్న సమాజంలో మానవ భావోద్వేగాలకు ఆయన కవిత్వం అద్దంపడుతుంది’ అని జ్ఞానపీఠ్ ఎంపిక బోర్డు చైర్మన్ ప్రతిభా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మలయాళ సాహితీవేత్తల్లో ప్రముఖుడైన అక్కితమ్ కేరళలో 1926లో జన్మించారు. అక్కితమ్ కవితలతోపాటు నాటకాలు, విమర్శనాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యం, కథలు, అనువాదాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అక్కితమ్ ఇప్పటి వరకు 55 పుస్తకాలు రాశారు. సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, కబీర్ సమ్మాన్ వంటి పురస్కారాలు అందుకున్నారు. -
మళయాళీ కవికి ప్రతిష్టాత్మక పురస్కారం
తిరువనంతపురం : సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞాన్‌పీఠ్ పురస్కారం 2019 ఏడాదికి గాను మళయాల కవి అక్కితంను వరించింది. అక్కితం అసలు పేరు అక్కితం అచ్చుతన్ నంబూద్రి. వీరు ప్రస్తుతం కేరళలోని పాలక్కడ్‌లో నివాసం ఉంటున్నారు. సాహిత్య రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గానూ ఈ గౌరవం దక్కింది. దీంతో కేరళ నుంచి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం పొందిన ఆరో వ్యక్తిగా అక్కితం గుర్తింపు పొందారు. ఇంతకుముందు కేరళ నుంచి పురస్కారం సాధించిన వారిలో జి.శంకరకురూప్, ఎస్కే పొట్టక్కడ్, తకజి శివశంకర పిళ్ళై, ఎంటీ వాసుదేవర్ నాయర్, ఓఎన్వీ కురూప్‌లు ఉన్నారు. 93 ఏళ్ల అక్కితం తన జీవితకాలంలో అనేకమైన అద్భుత రచనలు చేశారు. ఇప్పటిదాకా మళయాళంలో 45కు పైగా రచనలు చేశారు. 1952లో వచ్చిన 'కందకావ్య' అతని మొదటి రచనగా పేర్కొంటారు. బలిదర్శనం, అరన్‌గేత్తమ్, నిమీష క్షేత్రం, ఇడింజు పొలింజ లోకమ్, అమృతగాతికలు అక్కితం కవికి బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. శ్రీమద్భాగవతాన్ని మళయాళంలో శ్రీ మహాభాగవతం పేరుతో అనువధించారు. కాగా అక్కితం సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దీంతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డులు కూడా ఆయనను వరించాయి. -
కృష్ణ సోబతీకి జ్ఞానపీఠ్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం ఈ ఏడాది ప్రఖ్యాత హిందీ సాహితీవేత్త కృష్ణ సోబతీ(92)ని వరించింది. ‘2017 జ్ఞానపీఠ్ అవార్డ్‌కు కృష్ణ సోబతీని ఎంపిక చేసినట్లు జ్ఙానపీఠ్ సెలక్షన్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న గుజరాత్లో ఆమె జన్మించారు. ప్రయోగాత్మక, విలక్షణ శైలి కృష్ణ సోబతి ప్రత్యేకత. ఉర్దూ, హిందీ, పంజాబీ భాషల సొగసైన మేళవింపు ఆమె రచనల్లో కనిపిస్తుంది. దేశ విభజన, స్త్రీ, పురుష సంబంధాలు, మారుతున్న భారతీయ సమాజ స్థితిగతులు, పతనమవుతున్న మానవ విలువలు.. మొదలైనవి ఆమె రచనా వస్తువుల్లో ముఖ్యమైనవి. ఆమె రాసిన ‘దార్ సే బిఛుడీ, మిత్రో మర్జానీ, జిందగీనామా’ తదితర రచనలు ప్రఖ్యాతిగాంచాయి. -
బెంగాలీ రచయితకు జ్ఞానపీఠ్ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ బెంగాలీ కవి శంఖ ఘోష్‌ను దేశ సాహిత్య రంగంలోనే అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. 2016 సంవత్సరానికిగాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన వారిలో శంఖ ఘోష్ 52వ వారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఏటా భారతీయ జ్ఞాన్‌పీఠ్ ఈ పురస్కారాన్ని అందిస్తోంది. దీన్ని 1961లో ఏర్పాటు చేశారు. శంఖ ఘోష్ ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని చాందీపూర్‌లో జన్మించారు. 2011లో ఆయనకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. -
సాహితీ జ్ఞానపీఠం
కృష్ణాతీరం కళలకు కాణాచి. అంతేనా! కవులకు పుట్టినిల్లు. తెలుగులో తొలి జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఇక్కడి వారే. కృష్ణా జిల్లాలోని నందమూరు గ్రామంలో 1895 సెప్టెంబర్ 10న పుట్టారు ఆయన. చాలా చోట్ల పనిచేసినా, తన జీవితకాలంలో ఆయన ఎక్కువగా విజయవాడలో గడిపారు. ‘విశ్వేశ్వర శతకం’తో 1916లో రచనా వ్యాసంగాన్ని చేపట్టిన విశ్వనాథవారు సాహితీ రంగంలో చేపట్టని ప్రక్రియ లేదు. రాశిలోను, వాసిలోను వన్నెతరగని రచనా వైదుష్యం ఆయనది. ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము’తో ఆయనను జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. ఎక్కువగా గ్రాంథిక భాషలో రచనా వ్యాసంగాన్ని సాగించిన విశ్వనాథవారు ‘కిన్నెరసాని పాటలు’, ‘కోకిలమ్మ పెళ్లి’ వంటివి వ్యావహారికంలో రచించడం విశేషం. ఆనాటి యువతరాన్ని కిన్నెరసాని పాటలు ఉర్రూతలూపాయి. స్వాతంత్య్రపూర్వ భారతీయ మధ్యతరగతి సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఆయన రచించిన బృహత్తర నవల ‘వేయిపడగలు’ ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలను సంపాదించిపెట్టింది. ఇదే నవలను మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు హిందీలో ‘సహస్రఫణ్’ పేరిట అనువదించారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావును తొలిసారిగా రంగస్థలంపైకి తీసుకొచ్చిన ఘనత విశ్వనాథ వారిదే. గుంటూరు ఏసీ కాలేజీలో ఎన్టీఆర్ విశ్వనాథవారి శిష్యుడు. పల్నాటి చరిత్ర నేపథ్యంలో తాను రచించిన నాటకంలో విశ్వనాథవారు ఎన్టీఆర్ చేత నాగమ్మ పాత్ర వేయించారు. ఎన్టీఆర్ మీసాలు తీయడానికి నిరాకరిస్తే అలాగే మేకప్ వేసి, నాటకం ప్రదర్శించారు. విశ్వనాథ వారు అరవై నవలలు, రెండువందల ఖండకావ్యాలతో పాటు పలు నాటకాలు, కథలు, రేడియో నాటకాలు, పరిశోధన వ్యాసాలు రచించారు. భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మభూషణ్’ అవార్డుతో సత్కరించింది. సనాతన సంప్రదాయాలను గౌరవించే విశ్వనాథ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేవారు. అందువల్ల ఆయనను చాలామంది పాశ్చాత్య వ్యతిరేకి అనుకునేవారు. అయితే, ఆయన పాశ్చాత్య సాహిత్యాన్ని కూడా ఆమూలాగ్రంగా అధ్యయనం చేసేవారు. -
గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి జ్ఞానపీఠ్ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి దేశ సాహిత్య రంగంలోనే అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. 2015 సంవత్సరానికిగాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన వారిలో రఘువీర్ చౌదరి 51వ వారు. ప్రముఖ రచయిత, జ్ఞాన్‌పీఠ్ సెలెక్షన్ బోర్డు చైర్మన్ సురంజన్ దాస్ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన బోర్డు ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ప్రొఫెసర్ షమిమ్ హనిఫ్, హరీశ్ త్రివేది, రామకాంత్ రాత్, చంద్రకాంత్ పాటిల్, అలోక్‌రాయ్, దినేశ్‌మిశ్రా, లీలాధర్ మంద్లోయి పాల్గొన్నారు.ఆయన గుజరాతీలో పలు రచనలు చేశారు. రఘువీర్ చౌదరి గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు. గుజరాతీ సాహిత్యానికి వన్నె తెచ్చిన రచయిత 1938లో జన్మించిన రఘువీర్ చౌదరికి గుజరాతీ సాహిత్యంలో ప్రత్యేక స్థానముంది. నవలాకారుడిగా, కవిగా, విమర్శకుడిగా గుజరాతీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ వ్యక్తి ఆయన. ఆయన ప్రభావం ఎంతోమంది గుజరాతీ రచయితలపై ఉంది. గోవర్ధన్‌రాం త్రిపాఠి, కాకా కలేల్కర్, సురేశ్ జోషి, రామాదర్శ మిశ్రా, జీఎన్ డిక్కీ వంటి రచయితలు ఆయన రచనలతో ప్రభావితమైన వాళ్లే. భావవ్యక్తీకరణ గంభీరత, అర్థవంతమైన ఉపమాలు, ప్రతీకల ప్రయోగం రఘువీర్ కవిత్వంలో ప్రముఖంగా కనిపిస్తుంది. కవిత్వమే ఆయనకు అత్యంత ప్రీతికరమైనదైనా.. నవలా సాహిత్యంలో నిరంతర అన్వేషి ఆయన. మానవ జీవిత నిత్య ప్రవర్ధమాన కార్యకలాపాలను ప్రగతిశీల దృక్పథంతో బలోపేతం చేయడం ఆయన దృక్పథంగా కనిపిస్తుంది. ఆయన నవలలు 'అమృత', 'వేణు వాత్సల', 'ఉపర్వస్' త్రయంలో ఇదే దృక్పథం ప్రతిధ్వనిస్తుంది. ఆయన రచించిన 'రుద్ర మహాలయ' గుజరాతీ సాహిత్యంలోనే విఖ్యాత రచనగా నిలిచిపోయింది. సృజనాత్మక రచించడం, విభిన్నంగా ఆలోచనను ఆవిష్కరించే విషయంలో ఆయన రాసిన వ్యాసాలు ఆయన సునిశిత దృష్టిని చాటుతాయి. -
బాలచంద్ర నెమాడేకు జ్ఞానపీఠ్
సాక్షి, పింప్రి: సాహిత్య రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకమైన ‘జ్ఞానపీఠ్’ అవార్డును 2014కు గాను ప్రముఖ మరాఠీ సాహిత్యవేత్త బాలచంద్ర నెమాడే(76)కు ప్రదానం చేయనున్నారు. సాహిత్య రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు పది మందితో కూడిన సెలెక్షన్ బోర్డు శుక్రవారం ఢిల్లీలో ప్రకటించింది. కాగా, ఏప్రిల్‌లో ఆయనకు అవార్డును అందజేసే అవకాశం ఉంది. అవార్డు కింద 10 లక్షల రూపాయలు, సన్మాన పత్రంతో గౌరవించనున్నారు. బాలచంద్ర నెమాడే 1938లో జన్మించారు. 25 ఏళ్ల వయస్సులో 1963లో ‘కొసాలా’ నవలను 16 రోజుల్లో రచించారు. ఈ నవలతో మరాఠీ సాహిత్య రంగంలో విశిష్ట పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆ తర్వాత జరీలా, జూల్, బిడార్, హిందూ-ఏక్ సముద్రనవలలతో పాటు ఎన్నో కవితలను రాశారు. ఆయనకు ఇదివరకే సాహిత్య అకాడమి పురస్కారం(1991), నాసిక్ కునుమాగ్రజ్ ప్రతిష్టాన్ వారి జనస్థాన పురస్కారం లభించాయి. 2011లో పద్మశ్రీ అవార్డు ఆయనను వరించింది. మరాఠీ సాహిత్య రంగంలో జ్ఞానపీఠ్ అవార్డు గెల్చుకున్న నాల్గవ రచయిత బాలచంద్ర నెమాడే. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నెమాడేకు అభినందనలు తెలిపారు. -
అనంతమూర్తికి కన్నీటి వీడ్కోలు
కర్ణాటక సీఎం సహా వేలాది మంది నివాళి సాక్షి ప్రతినిధి, బెంగళూరు: జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ యూఆర్ అనంతమూర్తి(82)కి శనివారం సాయంత్రం ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బెంగళూరు విశ్వ విద్యాలయం ప్రాంగణంలోని కళాగ్రామలో 15 మంది పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ బ్రాహ్మణ సంప్రదాయానుసారం అనంతమూర్తి చితికి ఆయన కుమారుడు డాక్టర్ శరత్ నిప్పు పెట్టారు. అంతకుముందు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతమూర్తి భార్య ఎస్తేర్, కుమార్తె అనురాధ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సాహితీ వేత్తలు, పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. తీవ్ర అనారోగ్యంతో అనంతమూర్తి శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
2013 జ్ఞానపీఠ్ అవార్డు విజేత?
Banks Special 1. The Okavango Delta became the 1000th UNESCO World Herit-age Site in June 2014. It is in? 1) Namibia 2) Zimbabwe 3) Mali 4) Botswana 5) South Africa 2. Gro Harlem Brundtland was awarded with the first Tang Prize in Sustainable Development in June 2014. She is the former Prime Minister of? 1) Denmark 2) Norway 3) Finland 4) Netherlands 5) Austria 3. The Tang Prize is awarded on a biennial basis in four categories. Which of the following is not one of them? 1) Sustainable Development 2) Biopharmaceutical Science 3) Sinology 4) Rule of Law 5) Literature 4. Which Hindi poet was chosen for the prestigious Jnanpith Award for 2013 on June 20, 2014? 1) Sumitranandan Pant 2) Ramdhari Singh Dinakar 3) Naresh Mehta 4) Kedarnath Singh 5) None of these 5. Which India born Mexican plant scientist won the 2014 World Food Prize for his outstanding work in the improvement of wheat crop? 1) H.S. Gupta 2) Sanjay Rajaram 3) Anil Rai 4) Dinesh Kumar 5) S. Ayyappan 6. The World Food Prize was established in 1986 by? 1) M.S. Swaminathan 2) Food and Agriculture Organization 3) William Gaud 4) Norman Borlaug 5) International Rice Research Institute 7. The Tang Prize was established by Samuel Yin, a billionaire from? 1) USA 2) China 3) Taiwan 4) Russia 5) Japan 8. Which country will host the 41st G7/G8 Summit in 2015? 1) France 2) Italy 3) Germany 4) UK 5) Japan 9. Who has been appointed as Governor, State Bank of Pakistan with effect from April 29, 2014? (He succeeded Yaseen Anwar) 1) Ishrat Husain 2) Syed Salim Raza 3) Shahid Hafiz Kardar 4) Ashraf Mahmood Wathra 5) None of these 10. The International Maize and Wheat Improvement Center (CIMMYT) is located in? 1) Mexico 2) USA 3) India 4) Philippines 5) Canada 11. Who resigned as the President of the Central African Republic on 2014 January 10 ? 1) Nicolas Tiangaye 2) Francois Bozize 3) Michel Djotodia 4) Abakar Sabon 5) None of these 12. Which is the first country where Wimbledon has run 'The Road to Wimbledon' tennis event outside the United Kingdom? 1) USA 2) Serbia 3) Russia 4) India 5) Switzerland 13. World Music Day is celebrated every year on? 1) June 20 2) June 21 3) June 24 4) June 25 5) June 27 14. Which of the following books is written by Romila Thapar? 1) The Reason for God-Belief in an Age of Scepticism 2) The Sceptical Patriot 3) Physics of the Future- The Inventions That Will Transform Our Lives 4) The Past as Present-Forging Contemporary Identities through History 5) None of these 15. Catherine Samba-Panza assumed office as the interim President of which of the following African countries on January 23, 2014? (She is the first woman to hold the post) 1) Niger 2) Chad 3) Mali 4) Namibia 5) Central African Republic 16. C.Radhakrishnan was selected for the Moortidevi Award for 2013 on June 13, 2014. He is an eminent writer in which of the following languages? 1) Tamil 2) Kannada 3) Hindi 4) Telugu 5) Malayalam 17. Who assumed office as the President of Madagascar on 2014 January 25? 1) Omer Beriziky Roger Kolo 2) Hery Rajaonarimampianina 3) Andry Rajoelina 4) Jean-Louis Robinson 5) Marc Ravalomanana 18. Which country's head of State has the largest name? (His full name has 44 characters) 1) Madagascar 2) Bhutan 3) Argentina 4) Indonesia 5) Mali 19. Who won the prestigious DSC Prize for South Asian Literature for 2014 for his book 'Chronicles of a Corpse Bearer'? 1) Jeet Thayil 2) Cyrus Mistry 3) Amitav Ghosh 4) Shehan Karunatilaka 5) None of these 20. Cristiano Ronaldo is a renowned footballer from? 1) Brazil 2) Argentina 3) Portugal 4) Spain 5) Netherlands 21. Which of the following statements is not true with regard to 2014 Padma Awards? 1) 127 Padma Awards were giv-en which include Padma Vib-hushan for two individuals, Padma Bhushan for 24 and Padma Shri for 101 people 2) Out of 127 awardees 27 were women 3) 10 people belonged to categories like NRIs, PIOs, Foreigners and posthumous 4) Raghunath Mashelkar (Scientist) and B.K.S. Iyengar (Yoga Guru) are the Padma Vibhushan awardees 5) Film actors Paresh Rawal and Vidya Balan were given Padma Bhushan awards 22. Two sportspersons were given Padma Bhushan awards. One is Pullela Gopichand and the other is? 1) Anjum Chopra 2) Sunil Dabas 3) Dipika Pallikal 4) Leander Paes 5) Yuvraj Singh 23. Who, among the following Padma Bhushan awardees, is an author? 1) K. Radhakrishnan 2) Begum Parveen Sultana 3) T.H. Vinayakram 4) Anita Desai 5) Vijayendra Nath Kaul 24. Justice Dalveer Bhandari is one of the 24 Padma Bhushan awardees this year. He is? 1) The Chief Justice of Bombay High Court 2) The Chairman of National Human Rights Commission 3) Member, International Court of Justice 4) The Chairman, National Green Tribunal 5) None of these 25. Yu Si was conferred the Tamil Nadu government's Thiruvallu-var award in January 2014. Yu Si is a poet from? 1) Taiwan 2) Thailand 3) South Korea 4) Laos 5) Vietnam 26. Lisa Maria Singh is one of the winners of the 2014 Pravasi Bharatiya Samman. She is a politician from? 1) Canada 2) Fiji 3) UK 4) Australia 5) USA 27. The 12th Pravasi Bharatiya Divas (PBD), the annual convention of Non-Resident Indians (NRIs) was held in which of the following cities from 2014 January 7 to 9 ? 1) Kochi 2) Jaipur 3) New Delhi 4) Mumbai 5) Kolkata 28. The theme of the 12th Pravasi Bharatiya Divas in 2014 is Engaging Diaspora? 1) The Indian Growth Story 2) The Emotional Connect 3) India's Growth and Development 4) Connecting Across Generations 5) None of these 29. Justice Ashok Kumar Ganguly resigned as the Chairman of which of the following States Human Rights Commission in January 2014? 1) Assam 2) Haryana 3) Odisha 4) Meghalaya 5) West Bengal 30. Aditya Joshi is the first male junior player from India to be ranked world number one in which of the following sports? 1) Squash 2) Badminton 3) Tennis 4) Golf 5) Snooker 31. Against which team did Corey Anderson of New Zealand score the fastest one day international century? 1) Pakistan 2) India 3) Australia 4) Bangladesh 5) West Indies Key 1) 4 2) 2 3) 5 4) 4 5) 2 6) 4 7) 3 8) 3 9) 4 10) 1 11) 3 12) 4 13) 2 14) 4 15) 5 16) 5 17) 2 18) 1 19) 2 20) 3 21) 5 22) 4 23) 4 24) 3 25) 1 26) 4 27) 3 28) 4 29) 5 30) 2 31) 5 -
రావూరి భరద్వాజ మననుంచి దూరమయ్యారు
సంచలన రచనల కలం ఆగింది... అక్షర రుషి ప్రస్థానం ముగిసింది... ఎక్కడో పుట్టి... ఎక్కడో పెరిగి... సమాజంలోని స్థితిగతులను అధ్యయనం చేసి... సరస్వతీ కటాక్షాన్ని పొంది... అద్భుత రచనలు సాగించి... అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డును దక్కించుకున్న మన జిల్లావాసి... అటు పల్నాడు... ఇటు డెల్టా గాలి పీల్చిన రావూరి భరద్వాజ మననుంచి దూరమయ్యారు. ఆయన లేరన్న వార్త విన్న జిల్లా సాహితీ లోకం విషాదంలో మునిగిపోయింది. రావూరి భరద్వాజతో జిల్లాకున్న అనుబంధాన్ని ఓ సారి అవలోకనం చేసుకుంటే.. - సాక్షి, గుంటూరు / న్యూస్‌లైన్, తెనాలిరూరల్ దరిద్రం వెన్నాడుతుంటే తిండికే కనాకష్టంగా ఉన్న రోజుల్లో రోజుగడవటానికి ఎన్నో పనులు చేసినా చివరకు రచనా వ్యాసంగాన్నే నమ్ముకున్నారు రావూరి భరద్వాజ. 1950కి ముందు ‘ఒక్క పుస్తకం అచ్చయినా చాలు’ అనుకొన్న భరద్వాజ 140 పుస్తకాలు తీసుకొచ్చారంటే నిజంగా ఆశ్చర్యమే. ఆ పుస్తకాలు ఆయనకు కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు తెచ్చిపెట్టాయి. యూనివర్సిటీలు గౌరవడాక్టరేట్లను బహూకరించాయి. పలు పుస్తకాలు ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. అందులోని ‘పాకుడురాళ్లు’ పుస్తకానికి జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించారు. తన చిన్నతనంలో పడిన బాధలు, కష్టాలు, అవమానాలు, ఈసడింపులు అనుభవించకపోతే రచయితను అయివుండేవాణ్ని కాదనేవారు భరద్వాజ. బీడీలకెవరిస్తారు..? 1948లో తెనాలి చేరుకున్న ఆయన ఆలపాటి రవీంద్రనాథ్ ప్రారంభించిన పత్రికల్లో ఉద్యోగం, నెలకు రూ.25 జీతం. హోటల్లో భోజనం చేసి, ప్రెస్లోనే నిద్రించేవాడు. భోజనం అర్ధరూపాయి. రెండుపూటలా తింటే చాలవనీ, మధ్యాహ్నం లేటుగా అంటే 2.30 గంటల ప్రాంతంలో భోంచేసేవాడు. అదేమిటనీ హోటల్ యజమాని అడిగితే, ముందుగా తింటే రాత్రికి మళ్లీ ఆకలవుతుందని సమాధానమిచ్చాడట. దీంతో ఆయన జాలిపడి నెలకు రూ.30 విలువైన 60 భోజనం టికెట్లు రూ.25కే ఇస్తాను తీసుకొమన్నాట్ట. జీతం మొత్తం భోజనానికి పెడితే బీడీలకెవరిస్తారు? అనుకున్న భరద్వాజ ఆ మాటే పైకన్నాట్ట...నవ్వుకున్న హోటల్ యజమాని రూ.20 తీసుకుని నెల టికెట్లు ఇచ్చాడు. జీవితం అవస్థలమయమే.. తెనాలిలో ఉద్యోగం చేస్తున్నా, అవస్థల జీవితమే. అయినా తనకు పెద్ద రచయితలు తెలుసుననీ, ఆ విషయాన్ని ఊళ్లో గొప్పగా చెప్పుకోవాలని అనుకున్న భరద్వాజ, అప్పటికే రచయితగా పేరొందిన శారద (నటరాజన్)ను తీసుకొని అత్తగారింటికెళ్లి వారం రోజులున్నారు. తాను అనుకున్నట్టే ఊరంతా బాగా చూశారు.. తెనాలిలో ప్రెస్ పనవగానే ‘వృత్తి’చేసుకుని బతుకుతుండే లక్ష్మి దగ్గరకెళ్లి కూర్చునేవాడు. అక్కడ జైబూన్, చిత్ర అనే మరో ఇద్దరుండేవారు. రోజూ అక్కడకు వెళుతుంటే ‘అవసరం’ కోసం వెళుతున్నట్టే అనుకున్నారు. ‘అందుకు’రావడం లేదని నమ్మకం కుదిరాక, తమ గొడవలన్నీ భరద్వాజతో చెప్పుకునేవారు. వాటిని ఆధారం చేసుకుని కథలల్లిన భరద్వాజ, వాటిని వారికి వినిపించాకనే పత్రికలకు పంపేవారు. లక్ష్మి, జైబూన్, చిత్ర కలిసి, నాలుగు రూపాయల ఎనిమిదణాలకు తనకో కళ్లజోడు కొనిపెట్టారు. ఈ కళ్లజోడు ఇప్పటికీ భరద్వాజ దగ్గర పదిలంగా ఉంది. ‘ఈ లోకమంతా ‘చెడిపెలు’గా దుమ్మెత్తిపోసిన ముగ్గురు కరుణాంతరంగిణులు కొనిపెట్టిన ఆ కళ్లజోడును, ఓ గొప్ప బహుమానంగా నెనిప్పటికీ భావిస్తుంటాను’ అని చెప్పేవారు ఆయన. అవార్డులెన్నో.. జిల్లాలో ఆయన రచనలకు అవార్డులెన్నో వరించాయి. ఆచార్య నాగార్జున, విజ్ఞాన్ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో సత్కరిస్తే కేంద్ర ప్రభుత్వ జ్ఞానపీఠ్ పురస్కారం అందించింది. అవార్డు అందుకున్న కొన్నిరోజులకే ఆయన కన్నుమూశారు. తాడికొండలో విషాదఛాయలు తాడికొండ, న్యూస్‌లైన్ : జ్ఞానపఠ్ అవార్డు గ్రహీత రావూరి భరధ్వాజ మరణంతో శుక్రవారం తాడికొండలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణవార్త విని ఇక్కడివారు దిగ్భ్రాంతికి గురయ్యారు. తాడికొండలో మల్లంపల్లి అయ్యవార్లు, ఇనగంటి నరసింహరావుల ఇళ్లల్లో భరద్వాజ ఉండేవారు. 1947లో తాడికొండకు వచ్చిన భరద్వాజ 1967 వరకు స్థానిక ఎస్.వి.వి హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివారు. ప్రస్తుతం ఆయనకు వారసులు గాని బంధువులగాని ఇక్కడ లేరు. రావూరికి నివాళి గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్ : తెలుగు భాషకు ఖండాంతరాల ఖ్యాతిని తెచ్చిపెట్టిన సాహితీమూర్తి, గొప్ప మానవతావాది రావూరి భరద్వాజ మృతిపై సాహితీలోకం తెలుగు భాషాభిమానులు దిగ్భ్రాంతి చెందారు. నగరంలోని సాహిత్యవేత్తలు ఆయనకు అశ్రునివాళులర్పించారు. వారిలో కొందరి మనోభావాలు... చాలా బాధాకరం.. కావూరి మృతి అకాలం కాకపోయినా తెలుగు సాహితీపరులను చాలాకాలం బాధిస్తుంది. భరద్వాజ నేటి యువకులకు, రచయితలకు గొప్ప ఆదర్శంగా నిలుస్తారు. వ్యక్తిగా అత్యంత దారిద్య్రం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు. తెలుగు గ్రామీణ మూలాల నుంచి ఎదిగిన గొప్పరచయిత భరద్వాజ. తెలుగు సాహిత్యంలో అంతకు ముందు ఎవరూ స్పృశించని అట్టడుగు జీవిత కోణాలను తడిమారు. రచనా స్వభావంలో బెంగాలీ మహారచయిత శరత్‌బాబుకు, రావూరికి ఎంతో పోలిక ఉంది. ఆయన మానవతావాదం నేటి రచయితలకు మార్గదర్శకం. - డాక్టర్ పాపినేని శివశంకర్, సాహితీవేత్త మానవతావాది.. భరద్వాజ గుంటూరు నగరానికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే బస చేసేవారు. విజయవాడ రేడియోలో పనిచేసే సమయంలో ఓ రిక్షావాలా ఎక్కువ ఎత్తుకు రిక్షా లాగలేకపోతుంటే భరద్వాజ ఒక కిలోమీటరు వరకు రిక్షా వెనుక ఉండి తోసిన ఘటన ఆయన మనసును ప్రతిబంబిస్తుంది. తన రచనల్లోనే కాకుండా వ్యక్తిగతంగానూ ఎవరికి కష్టం వచ్చినా కన్నీళ్లు పెట్టుకునే స్వభావం ఆయనది. ఆయనకు జ్ఞానపీఠ్ వచ్చిందని ఆనందిస్తున్న సమయంలో కొద్దిరోజులకే ఈ విషాద వార్త సాహితీ ప్రియులను కలచివేస్తోంది. ఆయన రచనల్లోని భావాన్ని లక్ష్యాన్ని తర్వాత తరాల వారు కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి. - డాక్టర్ కడియాల రామ్మోహనరాయ్, జేకేసీ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు -
అక్షర శిఖరం అస్తమయం
అనారోగ్యంతో కన్నుమూసినరావూరి భరద్వాజ రచనల్లో కష్టజీవులకు పట్టం క ట్టిన అక్షర తపస్వి జ్ఞాన్‌పీఠ్ సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు జగ న్మోహన్రెడ్డి సహా పలువురు ప్రముఖుల సంతాపం సాక్షి, హైదరాబాద్: అక్షర కర్షకుడి శ్వాస ఆగిపోయింది. అట్టడుగు బతుకులను సాహిత్యమయం చేసిన అపురూప కలం నిలిచిపోయింది. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ(87) ఇకలేరు. శుక్రవారం రాత్రి ఇక్కడి బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో ఆయన తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. మధుమేహం, అధిక రక్తపోటు, మెడవద్ద ఫ్య్రాక్చర్, గుండె, కిడ్నీల వైఫల్యం, కడుపులో ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రావూరి రాత్రి 8.35 గంటలకు మృతిచెందారు. ఈ నెల 14న ఆస్పత్రిలో చేరిన ఆయనను ఐదు రోజులు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. రావూరికి నలుగురు కుమారులు రవీంద్రనాథ్, గోపీచంద్, బాలాజీ, కోటీశ్వరరావు ఉన్నారు. కుమార్తె పద్మావతి ఇటీవలే మృతి చెందారు. సతీమణి కాంతం 1986లోనే కన్నుమూశారు. రావూరి కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి దానం చేసి, భౌతిక కాయాన్ని విజయనగర్ కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. శనివారం మధ్యాహ్నం 12గంటలకు హుమాయూన్ నగర్‌లోని దేవునికుంట హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జీవనయానం దేశ సాహిత్యరంగంలో అత్యున్నత పురస్కారమైన ‘జ్ఞానపీఠ్’ వరించిన ఆరు నెలలకే రావూరి కన్నుమూయడం పాఠకులను కలచివేసింది. రచనే శ్వాసగా జీవించిన రావూరి 1927 జూలై 5న కృష్ణాజిల్లా నందిగామ తాలూకా మొగులూరులో జన్మించారు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. ఆయనపై ప్రముఖ రచయిత చలం ప్రభావం ఎక్కువగా ఉండేది. రావూరి రెండవ ప్రపంచ యుద్ధంలో టెక్నీషియన్‌గా పని చేశారు. కడుపు నింపుకోవడానికి ఫ్యాక్టరీల్లో, ప్రింటింగ్ ప్రెస్సుల్లో కూలిపని చేశారు. స్వాతంత్య్రానికి ముందు ‘జమీన్రైతు’ పత్రికలో పాత్రికేయుడిగా చేరారు. 1959లో ఆల్ ఇండియా రేడియాలో స్క్రిప్ట్ రైటర్‌గా చేరి 1987లో ఆ సంస్థలోనే పదవీ విరమణ చేశారు. అక్షరయానం రావూరి చిన్నప్పుడే చదువు మానేసినా జీవితాన్ని మాత్రం జీవితాంతం వరకు చదివారు. కుగ్రామంలో జన్మించిన ఆ అక్షర తపస్వి లైబ్రరీల్లో జ్ఞానదాహాన్ని తీర్చుకున్నారు. పస్తులు, ఆణాకానీ ఉద్యోగాల మధ్యే రచయితగా అడుగులు వేశారు. తన చుట్టూ ఉన్న పీడిత ప్రజల కష్టనష్టాలను అక్షరాలకెక్కిం చారు. నవలలు, కథలు, పిల్లల కథలు విస్తృతంగా రాశారు. 140కిపైగా రచనలు చేశారు. వీటిలో 43 కథాసంపుటాలు, 19 నవలలు, 7 నవలికలు ఉన్నాయి. కాయకష్టం చేసుకునే మూమూలు మనుషుల జీవితాలను ఆర్ద్రంగా కళ్లకు కట్టిన ‘జీవన సమరం’ రావూరి కలం సత్తా ఏంటో చాటింది. దీనికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అ వార్డు దక్కింది. సినీ జీవితంలోని చీకటి వెలుగులను అద్భుతంగా చిత్రిం చిన ‘పాకుడురాళ్లు’, ‘కాదంబరి’ తదితర రచనలు ఆయనకు పేరు ప్రఖ్యాతులను తెచ్చా యి. 2012 ఏడాదిగాను పాకుడురాళ్లు నవలను జ్ఞానపీఠ్ పురస్కారం వరిం చింది. విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్ సి.నారాయణరె డ్డిల తర్వాత ఈ పురస్కారాన్ని అందుకున్న తెలుగు రచయిత రావూరే. రావూరి ఇటీవల ఢిల్లీలో ఈ అవార్డు అందుకున్నారు. రావూరిని కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ, నాగార్జున వర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. గవర్నర్, సీఎం, బొత్స సంతాపాలు రావూరి మృతికి గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సంతాపం తెలిపారు. రావూరి మరణం సమాజానికి తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, డీకే ఆరుణ , టీడీపీ అధినేత చంద్రబాబు, మండలి బుద్ధ ప్రసాద్, విద్యావేత్త చుక్కా రామయ్య, డాక్టర్ సీ నారాయణరెడ్డి, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు తదితరులు కూడా జోహార్లు అర్పించారు. ఆయన రచన మట్టి పరిమళం: జగన్మోహన్రెడ్డి అక్షర దిగ్గజం రావూరి భరద్వాజ మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశ సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ రావూరి ఇంటి తలుపుతట్టిన ఆరు నెలలకే ఆయన దైవంలో ఐక్యం అయ్యారని సంతాప సందేశంలో పేర్కొన్నారు. ‘రావూరి అక్షరం.. వాన చినుకు మట్టిబెడ్డను తాకితే ఆ మట్టి వెదజల్లే పరిమళం. ఆయన రచ న అధోజగత్తు గుండె చప్పుడు. ఆయనకు రచన ఒక వ్యాపకం కాదు, దీక్ష. ఆయన జీవితం నిష్టతో కూడిన సందేశం. జ్ఞానపీఠ్‌ను స్వీకరించిన కొద్ది రోజులకే ఆయన భౌతికంగా కనుమరుగవడం బాధాకరం. రావూరి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆయన కుటుంబానికి సానుభూతిని తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. -
బతుకు పాఠాల మూట రావూరి
విజయవాడ, న్యూస్‌లైన్ : బతుకు నేర్పిన పాఠాలను మూట కట్టుకుని రచయితగా ఎదిగిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ (86) శుక్రవారం హైదరాబాదులో కన్నుమూశారు. తనకు ఎంతోమంది గురువులున్నా, దరిద్రం-ఆకలి-అవమానాలే ప్రధానమైన గురువులని చెప్పుకొనేవారాయన. జిల్లాలోని కంచికచర్ల మండలం మోగలూరులో 1927 జూలై 5న తన అమ్మమ్మగారి ఇంటి వద్ద ఆయన జన్మించారు. 8వ తరగతితోనే చదువుకు స్వస్తి పలికారు. తరగతి గదిలో ఆయనకు జరిగిన అవమానమే అందుకు కారణం. ఆయన తన జీవితంలో బతుకు నేర్పిన పాఠాలను, ఒక్కొక్కటిగా విప్పుతూ జీవనయానాన్ని సాగించారు. 19 నవలలు, 10 నాటకాలు రాసిన రావూరి జమీన్ రైతు పత్రికలో జర్నలిస్టుగా, ఆకాశవాణి కేంద్రంలోను పనిచేశారు. జర్నలిస్ట్‌గా, రచయితగా, ఆకాశవాణిలో పనిచేసినా సామాన్యుల కోసమే ఆయన రచనలు చేశారు. సామాన్యులకు కూడా అర్థమైన భాషలో రాసిన రావూరికి ఆలస్యంగానైనా జ్ఞానపీఠ్ అవార్డ్ రావడం సాహిత్యప్రియులను సంతోషపరిచింది. సాహిత్యపరంగా ఆయనకు జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలైన ముగ్గురిలో విశ్వనాథ సత్యనారాయణ, సి.నారాయణరెడ్డి కవులు కాగా, రావూరి మౌలికంగా వచనా రచయిత కావటం విశేషం. రావూరి మృతి తీరని లోటు కంచికచర్ల రూరల్ : ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ మృతి తీరని లోటని మోగులూరు గ్రామానికి చెందిన రావూరి మేనల్లుడు మోగులూరి ఆదినారాయణ, గ్రామస్తులు బండి మల్లిఖార్జునరావు, బండి కోటేశ్వరరావు, బండి జానకిరామయ్య, షేక్ హుస్సేన్‌లు పేర్కొన్నారు. మోగులూరి చినశేషయ్య కుమార్తెకు పుట్టిన భరద్వాజ పదేళ్ల పాటు ఇదే గ్రామంలో ఉన్నారని, అనంతరం గుంటూరు జిల్లా తాటికొండలో తన తండ్రి స్వస్థలంలో స్థిరనివాసం ఉన్నారని వివరించారు. -
తెలుగు సాహిత్య నిధి రావూరి
సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అంజద్ అలీఖాన్ ప్రశంస భరద్వాజకు జ్ఞానపీఠ్ అవార్డు ప్రదానం సాక్షి, న్యూఢిల్లీ: నవలా రచరుుత, సాహితీవేత్త రావూరి భరద్వాజ తెలుగు సాహిత్యానికి నిధివంటి వారని ప్రముఖ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అంజద్ అలీఖాన్ ప్రశంసించారు. సాహిత్యం, సంగీతం సముద్రం లాంటివని, రావూరివంటి గొప్ప సాహితీ వేత్తకు అవార్డు అందజేయడం తనకు ఎంతో గర్వకారణవుని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో తీన్‌మూర్తి భవన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రవుంలో రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ్ అవార్డును అంజద్ అలీఖాన్ అందజేశారు. అస్వస్థులైన భర ద్వాజ అతికష్టంమీద చక్రాల కుర్చీలో.. అవార్డు ప్రదానానికి హాజరయ్యారు. భారతీయ సాహిత్యంలో రావూరి ప్రస్థానం ఎంతో గొప్పదని వక్తలు ఈ సందర్భంగా కీర్తించారు. తమాషాకు అంటున్నారనుకున్నా.. అనారోగ్యం కారణంగా రావూరి భరద్వాజ మాట్లాడలేకపోవడంతో ఆయన ప్రసంగ పాఠాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయుం హిందీ విభాగం అధిపతి శేషారత్నం చదివి వినిపించారు.‘మనం కేవలం ఇతరులకు ఆదర్శాల గురించి చెప్పడమే కాదు. వాటిని పాటించాలి. జీవితంలో నేను పూర్తిగా అనుసరించాను. అదే నమ్మకంతో జీవితంలో కొద్దికొద్దిగా ఎదిగాను. పేద కుటుంబంలో పుట్టి, ఉన్నత చదువులులేని నేను ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటూనే జీవితంలో ముందుకెళుతూ వచ్చాను. ఈ రోజు మీ అందరి ముందు కూర్చోగలిగాను. నాకు జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిందని ఎవరో ఫోన్లో చెబితే నమ్మలేదు. తమాషాకోసం చెబుతున్నారనుకున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో పురస్కారాలు ఎలా వస్తున్నాయో అందరికీ తెలుసు. నా రచనలు ఎవరు ఇంత దూరం పంపుతారు. ఎవరికి నా రచనల గురించి తెలుస్తుందనుకున్నా. కానీ ఎలాంటి సిఫారసు చేయకుండానే, నా రచనలకు ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిందంటే ఎంతో సంతోషంగా ఉంది. దీంతో నా జీవితం ధన్యమైంది. జ్ఞానపీఠ్ అవార్డు సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా రచనలను సమీక్షచేసి మీ ముందుంచిన పట్నాల.సుధాకర్‌కి సైతం నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా.’ అని భరధ్వాజ తన ప్రసంగ పాఠంలో పేర్కొన్నారు. పలువురు సాహిత్య అభివూనులతో పాటు రావూరి కుటుంబ సభ్యులు అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. -
జ్ఞాన్‌పీఠ్ అవార్డును మొదట అందుకున్నవారు?
ఎన్. విజయేందర్ రెడ్డి జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. వివిధ పోటీ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ , కరెంట్ అఫైర్‌సలలో తప్పనిసరిగా అవార్డుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. వివిధ అవార్డులు, వీటిని ఎవరు ఏర్పాటు చేశారు? ఏ రంగంలో ఇస్తారు? ప్రథమ విజేతలు, ఇటీవల ఎవరికి లభించింది? వంటి ప్రశ్నలు అడుగుతారు. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో వివిధ అవార్డులు గురించి తెలుసుకుందాం. భారతరత్న భారతరత్న భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారం. కళలు, సాహిత్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలు, ప్రజా సేవల రంగాలలో అత్యున్నత కృషికి ఇస్తారు. 2011లో క్రీడలను కూడా ఈ జాబితాలో చేర్చారు. 1954లో మొదటిసారిగా ముగ్గురికి భారతరత్న లభించింది.వారు భారతదేశ చివరి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి, తొలి ఉపరాష్ర్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్. ఇప్పటివరకు 41 మందికి భారతరత్న లభించింది. చివరిసారిగా 2008లో పండిట్ భీమ్సేన్ జోషికి ప్రదానం చేశారు. ఈ అవార్డును మరణానంతరం పొందిన మొదటి వ్యక్తి భారత రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఆయనకు 1966లో ఈ అవార్డు లభించింది. భారతరత్న పొందిన మొదటి మహిళ ఇందిరాగాంధీ (1971). భారతరత్న ఇద్దరు విదేశీయులకు కూడా లభించింది. 1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (పాకిస్థాన్)కు, 1990లో నెల్సన్ మండేలా (దక్షిణాఫ్రికా)కు లభించింది. భారతరత్న లభించిన వ్యక్తులలో నలుగురు జీవించి ఉన్నారు. వారు.. అబ్దుల్ కలాం (1997), అమర్త్యసేన్ (1999), లతా మంగేష్కర్ (2001), నెల్సన్ మండేలా (1990). పద్మ అవార్డులు భారతరత్న తర్వాత అత్యున్నతమైన పౌర పురస్కారాలు వరుసగా పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ సంవత్సరం జనవరి 26న 108 మందికి పద్మ అవార్డులు బహూకరించారు. ఇందులో 24 మంది మహిళలు. 2013 విజేతలు.. పద్మవిభూషణ్: నలుగురికి లభించింది. రఘునాథ్ మహాపాత్ర (శిల్పి), హైదర్ రజా (చిత్రకళ), సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో యశ్పాల్, రొద్దం నరసింహ. పద్మభూషణ్: 24 మందికి ప్రదానం చేశారు. కొంతమంది ప్రముఖులు: సినిమా రంగానికి చెందిన డి.రామానాయుడు, ఎస్.జానకి, షర్మిలా ఠాగోర్, రాజేష్ ఖన్నా, (మరణానంతరం), జస్పాల్ భట్టి (మరణానంతరం). భరత నాట్యకారిణి సరోజ వైద్యనాథన్, సైన్స విభాగంలో శివథాను పిళ్లై, విజయకుమార్ సారస్వత్, అశోక్ సేన్, బి.ఎన్. సురేష్. పరిశ్రమ రంగానికి చెందిన ఆర్. త్యాగరాజన్, ఆది గోద్రెజ్. సాహిత్యంలో మంగేష్ పడ్గావ్కర్, గాయత్రి స్పివాక్. క్రీడారంగంలో క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, మహిళా బాక్సర్ మేరీకోమ్. పద్మశ్రీ: 80 మందికి ప్రదానం చేశారు. కొంతమంది ముఖ్యులు: చలనచిత్ర రంగానికి చెందిన శ్రీదేవి కపూర్, నానా పటేకర్, బాపు, రమేష్ సిప్పీ; మన రాష్ట్రానికి చెందిన గజం అంజయ్య (చేనేత), సురభి బాబ్జీ (ఆర్ట), చిట్టా వెంకట సుందరరామ్ (వైద్యం), రామకృష్ణరాజు (సైన్స అండ్ ఇంజనీరింగ్) ఉన్నారు. చలన చిత్ర రంగ అవార్డులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు: భారతదేశ అత్యున్నత సినిమా అవార్డు. భారతీయ చలనచిత్ర పితామహుడిగా పేరు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే పేరిట ఈ అవార్డును భారత ప్రభుత్వం 1969లో నెలకొల్పింది. ఈ అవార్డు కింద స్వర్ణకమలం, పది లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. తొలి విజేత 1969లో దేవికా రాణి రోరిచ్. 2012లో ఈ బహుమతిని ప్రముఖ హిందీ నటుడు ప్రాణ్‌కు ప్రదానం చేశారు. ఇప్పటివరకు 44 మందికి లభించింది. 1971లో పృథ్వీరాజ్ కపూర్‌కు ప్రకటించారు. మరణానంతరం ఈ అవార్డు పొందిన తొలి వ్యక్త్తి పృథ్వీరాజ్ కపూర్. భారతదేశపు తొలి మూకీ చిత్రం రాజాహరిశ్చంద్రను దాదాసాహెబ్ ఫాల్కే 1913లో నిర్మించాడు. ఆ సినిమా మే 3, 1913లో విడుదలైంది. అందుకే ఈ అవార్డును, జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రతి ఏటా మే 3న ప్రదానం చేస్తారు. 60వ జాతీయ చలనచిత్ర అవార్డులు: ఈ అవార్డులను మే 3, 2013 నాడు ప్రదానం చేశారు. దేఖ్ ఇండియన్ సర్కస్ అనే హిందీ చిత్రం అత్యధికంగా నాలుగు అవార్డులను గెలుచుకున్నది. ఉత్తమ చిత్రం పాన్‌సింగ్ తోమర్ (హిందీ), ఉత్తమ బాలల చిత్రం దేఖ్ ఇండియన్ సర్కస్ (హిందీ), ఉత్తమ దర్శకుడు శివాజీ లోతన్ పాటిల్ (మరాఠీ చిత్రం దాగ్), ఉత్తమ నటులు 1) ఇర్ఫాన్ ఖాన్ (పాన్‌సింగ్ తోమర్), 2) విక్రమ్ గోఖలే (మరాఠీ చిత్రం అనుమతి). ఉత్తమ నటి ఉషా జాదవ్ (మరాఠీ చిత్రం దాగ్), ఉత్తమ సహాయ నటుడు అన్నుకపూర్ (హిందీ చిత్రం వికీడోనర్), ఉత్తమ సహాయ నటి 1) డాలీ అహ్లూవాలియా (వికీడోనర్), 2) కల్పన (మలయాళ చిత్రం తనిచళ ఎంజన్). 58వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు: ఫిల్మ్‌ఫేర్ అవార్డులను టైమ్స్ గ్రూప్ 1954లో ప్రారంభించింది. వీటిని హిందీ చలన చిత్ర రంగంలో ప్రతిభావంతులకు ఇస్తారు. 58వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను జనవరి 20, 2013న ముంబైలో ప్రదా నం చేశారు. బర్ఫీ చిత్రానికి 7 అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం-బర్ఫీ, ఉత్తమ దర్శకుడు- సుజయ్‌ఘోష్ (కహానీ),ఉత్తమ నటుడు-రణ్‌బీర్ కపూర్(బర్ఫీ), ఉత్తమ నటి-విద్యాబాలన్ (కహానీ), ఉత్తమ సహాయనటుడు-అన్నూ కపూర్(వికీడోనర్), ఉత్తమ సహాయ నటి - అనుష్కశర్మ (జబ్‌తక్ హై జాన్), జీవితకాల సాఫల్య పురస్కారం-యశ్ చోప్రా(మరణానంతరం). జాతీయ క్రీడా అవార్డులు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న: క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం.1991 -92లో ప్రారంభించారు. 7,50,000 రూపాయల నగ దు బహుమతిని ఇస్తారు. మొదటి విజేత విశ్వనాథన్ ఆనంద్. 2012-13కు గానూ షూటింగ్ నిపుణుడు రంజన్ సోధికి లభించింది. 2010-11లో గగన్ నారంగ్ (షూటింగ్), 2011-12లో విజయ్‌కుమార్ (షూటింగ్), యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్)లకు లభించింది. ఇప్పటివరకూ ఏడుగురు షూటర్లకు ఈ పురస్కారం లభించింది. అర్జున: అర్జున అవార్డులను భారత ప్రభుత్వం 1961లో ప్రారంభించింది. ఐదు లక్షల నగదు బహుమతిని ఇస్తా రు. ఈ ఏడాది 14 మందికి ఇచ్చారు. వారు విరాట్ కోహ్లీ (క్రికెట్), చెక్రవోలు స్వురో (ఆర్చరీ), పి.వి.సింధు (బ్యాడ్మింటన్), కవితాచాహల్ (బాక్సింగ్), రూపేష్ షా (బిలియర్డ్స), అభిజిత్ గుప్తా (చెస్), గగన్‌జీత్ భుల్లార్ (గోల్ఫ్), సబా అంజుమ్ (హాకీ), రాజ్‌కుమారి రాథోర్ (షూటింగ్), జోత్స్న చిన్నప్ప (స్క్వాష్), మౌమ దాస్ (టేబుల్ టెన్నిస్), నేహారాధి (రెజ్లింగ్), ధర్మేందర్ దలాల్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ సరోహ (పారా అథ్లెటిక్స్). ద్రోణాచార్య అవార్డు: ద్రోణాచార్య అవార్డును క్రీడా శిక్షకులకు ఇస్తారు. ఈ అవార్డును 1985లో ప్రారంభించారు. రూ. 5 లక్షల నగదు బహుమతిని ఇస్తారు. 2013 సంవత్సరానిగానూ ఐదుగురు కోచ్‌లకు లభించింది. వారు పూర్ణిమా మహతో (ఆర్చరీ), మహావీర్‌సింగ్ (బాక్సింగ్), నరీందర్ సింగ్ సైనీ (హాకీ), కె.పి.థామస్ (అథ్లెటిక్స్), రాజ్‌సింగ్ (రెజ్లింగ్). ధ్యాన్‌చంద్ అవార్డు: క్రీడల్లో జీవితకాల సాఫల్యానికి గాను ఇస్తారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. 2002లో ప్రారంభించిన ఈ అవార్డు కింద ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. ఆగస్టు 31, 2013న ధ్యాన్‌చంద్ అవార్డును భారత రాష్ర్టపతి నలుగురికి అందజేశారు. వారు సయ్యద్ అలీ (హాకీ), మేరీ డిసౌజా (అథ్లెటిక్స్), అనిల్‌మన్ (రెజ్లింగ్), గిరిరాజ్ సింగ్ (పారా స్పోర్ట్స). సాహిత్య అవార్డులు జ్ఞాన్‌పీఠ్ పురస్కారం: ఈ అవార్డును సాహుజైన్ కుటుంబం స్థాపించిన భారతీయ జ్ఞాన్‌పీఠ్ ట్రస్ట్ ప్రతిఏటా ఇస్తుంది. రాజ్యాంగంలోని 22 అధికార భాషలకు చెందిన రచనలకు జ్ఞాన్‌పీఠ్ అవార్డును ఇస్తారు. మొదటి గ్రహీత 1965లో జి. శంకర కురూప్. ఆయన మలయాళ రచయిత. ఇప్పటివరకు 53 మందికి లభించింది. ఈ అవార్డు కింద 11 లక్షల రూపాయలను బహూకరిస్తారు. మొదటి మహిళా గ్రహీత 1976లో ఆశాపూర్ణాదేవి. బెంగాలీ రచన ప్రథమ్ ప్రతిశ్రుతికిగాను ఆమెకు జ్ఞాన్‌పీఠ్ లభించింది. ఇప్పటివరకూ ఏడుగురు మహిళలు ఈ అవార్డు పొందారు. 2012 కు 48వ జ్ఞాన్‌పీఠ్ అవార్డు విజేత తెలుగు రచయిత రావూరి భరద్వాజ. ఆయన రాసిన పాకుడురాళ్లు నవల కు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు పొందిన మూడో తెలుగు రచయిత రావూరి భరద్వాజ. 1970లో రామాయణ కల్పవృక్షంకు విశ్వనాథ సత్యనారాయణకు, 1988 లో విశ్వంభరకు డాక్టర్ సి. నారాయణరెడ్డికి లభించింది. మూర్తిదేవి అవార్డు: దీన్ని కూడా భారతీయ జ్ఞాన్‌పీఠ్ సంస్థ ప్రదానం చేస్తుంది. 1983లో ప్రారంభించిన ఈ బహుమతి కింద రెండు లక్షల రూపాయల నగదును ఇస్తారు. 2013 గ్రహీత హరిప్రసాద్ దాస్. ఒడియా భాషలో ఈయన రచించిన ‘వంశ’ అనే గ్రంథానికి ఈ అవార్డు లభించింది. సరస్వతీ సమ్మాన్: 1991లో కె.కె. బిర్లా ఫౌండేషన్ వారు స్థాపించిన ఈ అవార్డును 22 భాషలలో రచనలకు ఇస్తారు. రూ. పది లక్షల నగదును ఇస్తారు. 2013లో ఈ బహుమతిని మలయాళ రచయిత్రి సుగతా కుమారికి ప్రదానం చేశారు. ఆమె రచన ‘మనలెజుతు’. వ్యాస్ సమ్మాన్: దీన్ని కూడా 1991లో కె.కె. బిర్లా ఫౌండేషన్ స్థాపించింది. హిందీ రచనలకు మాత్రమే ఇస్తారు. 2.5 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. 2012 విజేత నరేంద్ర కోహ్లీ. ‘నభూతో న భవిష్యతి’ అనే హిందీ రచనకు ఆయనకు ఈ అవార్డు లభించింది. ధైర్యసాహసాలకు ఇచ్చే అవార్డులు పరమవీరచక్ర: ఇది భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం. ఈ అవార్డును తొలిసారిగా నవంబర్ 3, 1947న మేజర్ సోమ్‌నాథ్ శర్మకు మరణానంతరం ప్రదానం చేశారు. పరమవీరచక్ర తర్వాత అత్యున్నత మిలిటరీ అవార్డులు మహావీర చక్ర, వీరచక్ర. అశోక్ చక్ర: యుద్ధం జరగని సందర్భంలో, శాంతి సమయంలో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం. 2012లో ఈ అవార్డు నవదీప్‌సింగ్‌కు మరణానంతరం లభించింది. అశోక్ చక్ర తర్వాత శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత అవార్డులు కీర్తిచక్ర, శౌర్యచక్ర. రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డు దీన్ని 1992లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసింది. సద్భావన, జాతీయ సమగ్రత, శాంతిని పెంపొందించేందుకు కృషి చేసిన వారికి రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డును ఇస్తారు. ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. ప్రతి ఏటా రాజీవ్‌గాంధీ జయంతి అయిన ఆగస్టు 20న ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఆగస్టు 20ను సద్భావన దివస్‌గా జరుపుకుంటారు. 2013కు సరోద్ వాద్యకారుడు అంజద్ అలీఖాన్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని 1986లో ప్రారంభించారు. 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. 2012 గ్రహీత లైబీరియా దేశాధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీఫ్. ఈ అవార్డు లభించిన ప్రముఖులు రాజీవ్‌గాంధీ(1991), వాక్లెద్ హోవెల్(1993), జిమ్మీ కార్టర్ (1997), మహ్మద్ యూనస్ (1998), ఎం.ఎస్ స్వామినాథన్ (1999), కోఫి అన్నన్ (2003), హమీద్ కర్జాయ్ (2005), షేక్ హసీనా (2009), ఇలాభట్ (2011). లతా మంగేష్కర్ అవార్డు మధ్యప్రదేశ్ ప్రభుత్వం లతా మంగేష్కర్ సమ్మాన్ అలంకరణ్‌ను 1984 లో ప్రవేశపెట్టింది. నగదు బహుమతి రెండు లక్షల రూపాయలు. 2013 గ్రహీత ప్రముఖ గాయకుడు హరిహరన్. కాళిదాస్ సమ్మాన్ దీన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కళలకుగానూ ప్రదానం చేస్తుంది. 1980లో ప్రవేశపెట్టారు. 2012లో ఈ అవార్డును హిందీ నటుడు అనుపమ్‌ఖేర్ స్వీకరించారు. టాగోర్ కల్చరల్ హార్మనీ అవార్డు కోటి రూపాయల నగదు బహుమతిని ఇస్తారు. 2013 విజేత పాశ్చాత్య సంగీత కారుడు జుబిన్ మెహతా. ఈ అవార్డును రవీంద్రనాథ్ టాగోర్ 150వ జయంతి సందర్భంగా 2012లో ఏర్పాటు చేశారు. తొలి గ్రహీత సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్. వివిధ ఏపీపీఎస్సీ పరీక్షల్లో జాతీయ అవార్డులపై అడిగిన కొన్ని ప్రశ్నలు 1.భారతదేశ 64వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పద్మవిభూషణ్ పొందిన వారు? 2.భారతదేశ 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాహిత్యం, విద్యారంగంలో పద్మభూషణ్ అవార్డు ఎవరికి వచ్చింది? 3.2013లో కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి పద్మ అవార్డులు అందజేసింది? 4.భారతరత్న అవార్డును పొందిన మొదటి భారతీయ మహిళ? 5.ఇండియాలో శాంతి సమయంలో ధైర్యసాహసాలకు ఇచ్చే అత్యుత్తమ అవార్డు? 6.జ్ఞాన్‌పీఠ్ అవార్డును మొదట అందుకున్నవారు? 7.భారతీయ జ్ఞాన్‌పీఠ్ అవార్డును ఏర్పాటుచేసిన సంవత్సరం? 8.ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి 2011కి ఎవరు ఎంపికయ్యారు? 9.దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మొట్టమొదట స్వీకరించింది? 10.ఇండియాలో క్రీడలలో అత్యుత్తమ గౌరవచిహ్నంగా ఇచ్చే అవార్డు? సమాధానాలు: 1) హైదర్ రజా, 2) మంగేష్ పడ్గావ్కర్, 3) 108, 4) ఇందిరాగాంధీ, 5) అశోక్ చక్ర, 6) జి.శంకర కురూప్, 7) 1961, 8) ఇలాభట్, 9) దేవికారాణి రోరిచ్, 10) రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న.