న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం ఈ ఏడాది ప్రఖ్యాత హిందీ సాహితీవేత్త కృష్ణ సోబతీ(92)ని వరించింది. ‘2017 జ్ఞానపీఠ్ అవార్డ్‌కు కృష్ణ సోబతీని ఎంపిక చేసినట్లు జ్ఙానపీఠ్ సెలక్షన్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న గుజరాత్‌లో ఆమె జన్మించారు. ప్రయోగాత్మక, విలక్షణ శైలి కృష్ణ సోబతి ప్రత్యేకత. ఉర్దూ, హిందీ, పంజాబీ భాషల సొగసైన మేళవింపు ఆమె రచనల్లో కనిపిస్తుంది. దేశ విభజన, స్త్రీ, పురుష సంబంధాలు, మారుతున్న భారతీయ సమాజ స్థితిగతులు, పతనమవుతున్న మానవ విలువలు.. మొదలైనవి ఆమె రచనా వస్తువుల్లో ముఖ్యమైనవి. ఆమె రాసిన ‘దార్ సే బిఛుడీ, మిత్రో మర్జానీ, జిందగీనామా’ తదితర రచనలు ప్రఖ్యాతిగాంచాయి.
Comments
Please login to add a commentAdd a comment