Hindi literature
-
కృష్ణ సోబతీకి జ్ఞానపీఠ్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం ఈ ఏడాది ప్రఖ్యాత హిందీ సాహితీవేత్త కృష్ణ సోబతీ(92)ని వరించింది. ‘2017 జ్ఞానపీఠ్ అవార్డ్కు కృష్ణ సోబతీని ఎంపిక చేసినట్లు జ్ఙానపీఠ్ సెలక్షన్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న గుజరాత్లో ఆమె జన్మించారు. ప్రయోగాత్మక, విలక్షణ శైలి కృష్ణ సోబతి ప్రత్యేకత. ఉర్దూ, హిందీ, పంజాబీ భాషల సొగసైన మేళవింపు ఆమె రచనల్లో కనిపిస్తుంది. దేశ విభజన, స్త్రీ, పురుష సంబంధాలు, మారుతున్న భారతీయ సమాజ స్థితిగతులు, పతనమవుతున్న మానవ విలువలు.. మొదలైనవి ఆమె రచనా వస్తువుల్లో ముఖ్యమైనవి. ఆమె రాసిన ‘దార్ సే బిఛుడీ, మిత్రో మర్జానీ, జిందగీనామా’ తదితర రచనలు ప్రఖ్యాతిగాంచాయి. -
గీత బాటలో...
స్ఫూర్తి ఇక్కడ మేకపిల్లతో కనిపిస్తున్న మహిళ పేరు గీతాఫర్తియాల్. మొన్నటివరకూ ఆమెను ఓ నలభై మేకల యజమానిగానే చూశారందరూ. ఇప్పుడు గీత చిరునామా మారిపోయింది. ఒక పక్క మేకలను మేపుకుంటూనే వాటిపై వచ్చిన ఆదాయంతో హిందీ సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది గీత. ఉత్తరాఖాండ్ హిమాలయ కొండల ప్రాంతంలో ఉన్న కొతెరా గ్రామానికి చెందిన గీత ఈ మధ్యనే అల్మొరా విశ్వవిద్యాలయంలో తన చదువు పూర్తి చేసింది. అప్పటివరకూ అందరూ గీతను ఏవో పుస్తకాలు చదువుకునే అమ్మాయిగానే చూశారు. తీరా ఇంత చదువు చదివిందని తెలియగానే అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆ ప్రాంతంలో మేకల్ని అమ్ముకుని బతికేవారు ఎక్కువ. ముఖ్యంగా మహిళలు. వాటిపై వచ్చిన ఆదాయంతో పెళ్లిళ్లు చేయడమొక్కటే తెలిసిన మహిళలకు గీత ఆదర్శంగా నిలబడింది. మాస్టర్ డిగ్రీ చేతిలో ఉన్న గీత ప్రస్తుతం తన మేకలను అన్నకు అప్పగించి ఉద్యోగం వేటలో ఉంది. ‘ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో మరిన్ని మేకల్ని కొని వాటిపై వచ్చిన ఆదాయంతో మరిన్ని మంచి పనులు చేయాలనుకుంటున్నాను’ అని చెప్పే గీత మాటలు పెంపుడు జంతువులను నమ్ముకుని బతికే ప్రతి మహిళకూ ఆదర్శమే. -
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
ప్రతి ఏటా జరిగే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఈ సంవత్సరం జనవరి 24, 25, 26 తేదీల్లో హైదరాబాద్లోని నాలుగు ప్రాంగణాల్లో (ఆషియానా, లామకాన్, కళాకృతి, సప్తపర్ణి) జరగనుంది. ఈసారి రాజమోహన్ గాంధీ, మల్లికా సారాభాయ్, ఆనంద్ గాంధీ, మృదులా గార్గ్, సుబోధ్ సర్కార్, గీతా హరిహరన్ తదితరులు పాల్గొంటారు. ఈసారి హిందీ సాహిత్యం మీద ప్రధాన దృష్టి ఉంటుంది. ముషాయిరాలకు కూడా కొదవ లేదు. ఈసారి ప్రత్యేకం- ఐరిష్ సాహిత్య బృందం. అందరూ ఆహ్వానితులే. వివరాలకు: http://www.hydlitfest.org చూడండి.