క్యాంపస్‌లో మొరిగితే ఏం ఉపయోగం? | JNU website hacked, anti seperatist slogans written | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌లో మొరిగితే ఏం ఉపయోగం?

Published Wed, Feb 17 2016 9:16 AM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM

క్యాంపస్‌లో మొరిగితే ఏం ఉపయోగం? - Sakshi

క్యాంపస్‌లో మొరిగితే ఏం ఉపయోగం?

తీవ్ర వివాదాల్లో కూరుకుపోయిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ వెబ్‌సైట్‌ హ్యాక్ అయింది. 'జేఎన్‌యూ క్యాంపస్‌లో మొరిగితే మీకు కశ్మీర్ వస్తుందని భావిస్తున్నారా' అనే మెసేజి దానిమీద కనిపించింది. పార్లమెంటు మీద దాడి చేసిన అఫ్జల్‌గురు ఉరితీతకు నిరసనగా యూనివర్సిటీలో కార్యక్రమాలు జరిగిన నేపథ్యంలో వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. 'బ్లాక్ డ్రాగన్' అనే పేరుతో దీన్ని హ్యాకింగ్ చేసినట్లు చెప్పుకొన్నారు.

''కశ్మీర్‌కు స్వాతంత్ర్యం వచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని అంటున్నారు.. జేఎన్‌యూ క్యాంపస్‌లో మొరిగినంత మాత్రాన మీకు కశ్మీర్ వస్తుందని అనుకుంటున్నారా'' అని రాశారు. వెబ్‌సైట్ హ్యాక్ అయిన విషయాన్ని ఆఫీసు సమయం ముగిసిన తర్వాత గమనించామని, యూనివర్సిటీ ఐటీ శాఖకు ఈ విషయం తెలియజేశామని, వాళ్లు తగిన చర్యలు తీసుకుంటారని వర్సిటీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement