website hacking
-
సామాన్యుడు విసిరిన సవాళ్లు!
సాక్షి, సిటీబ్యూరో: సామాన్యులు సైతం ఒక్కోసారి పెద్దపెద్ద వ్యవస్థల్ని కదిలిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ‘హైటెక్ నేరాలకు’ పాల్పడుతూ సవాళ్లు విసురుతున్నారు. వీరిస్తున్న షాక్‌లతో యంత్రాంగాల దిమ్మ తిరిగిపోయి నష్ట నివారణ చర్యలు అన్వేషిస్తున్నాయి. 2010లో వెలుగులోకి వచ్చిన పాస్‌పోర్ట్ కార్యాలయం వెబ్సైట్ హ్యాకింగ్ నుంచి తాజాగా బయటపడిన ‘క్లోన్డ్ వేలిముద్రల’ వ్యవహారం వరకు ఈ కోవకు చెందినవే. ఆయా నిందితులు ఈ నేరాలకు పాల్పడింది కేవలం తమ అవసరాల కోసమే కావడం గమనార్హం. స్లాట్స్ కోసం ఆర్పీఓ వెబ్సైట్... ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు చెందిన గోరంట్ల లతాధర్‌రావు పీజీడీసీఏ పూర్తి చేసి అక్కడే లలిత ఫ్యాన్సీ అండ్ కూల్ డ్రింక్స్ దుకాణం నిర్వహించేవాడు. ఇతడికి 2010లో ఆకాష్ ట్రావెల్స్ నిర్వాహకుడు షేక్ సుభానీతో పరిచయమైంది. లతాధర్‌కు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో తన వద్దకు వచ్చే పాస్‌పోర్ట్ అప్లికేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కోసం సుభానీ ఇతని సాయం తీసుకునే వాడు. తత్కాల్ స్కీమ్ కింద పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు దళారులను ఆశ్రయించడం ప్రారంభించి ఆన్లైన్ స్లాట్ ఇప్పిస్తే భారీ మొత్తాలను చెల్లించడానికి ముందు రావడం మొదలుపెట్టారు. దీంతో పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి స్లాట్స్ బ్లాక్ చేయాలన్న ఆలోచన లతాధర్, సుభానీలకు వచ్చింది. తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించి లతాధర్ ఈ పని చేశాడు. రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం వెబ్‌సైట్‌లోనికి ఎంటర్ అయ్యే లతాధర్ దాని నుంచి నేరుగా సర్వర్‌కు కనెక్ట్ అయ్యే వాడు. ప్రతి రోజూ స్లాట్స్ విడుదల చేసే సమయంలో ఇతరులు వాటిలోకి లాగాన్ కాకుండా చేసే వాడు. తమను ఆశ్రయించిన వారి అప్లికేషన్స్ అప్లోడ్ చేసిన తరవాతే స్లాట్స్‌ను ఫ్రీ చేసే వాడు. ఈ వ్యవహారం అదే ఏడాది జూన్‌లో వెలుగులోకి రావడంతో టాస్‌్కఫోర్స్ పోలీసులు లతాధర్ సహా ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఆన్లైన్ స్లాట్స్ కేటాయింపునకు ఉపయోగపడే పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌కు చెందిన సోర్స్ కోడ్‌ను హ్యాక్ చేయడం ద్వారా ఇతరులకు స్లాట్స్ దొరక్కుండా బ్లాక్ చేస్తున్నట్లు లతాధర్ ఒప్పుకున్నాడు. టార్గెట్, నగదు కోసం నకిలీ వేలిముద్రలు... కేవలం టార్గెట్‌కు తగ్గట్టు సిమ్‌కార్డులు విక్రయించడానికి పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన ధనలక్ష్మీ కమ్యూనికేషన్స్ నిర్వాహకుడు పాత సంతోష్‌కుమార్ ఏకంగా నకిలీ వేలిముద్రల్నే సృష్టించేశాడు. ఈ తరహా ఉదంతం వెలుగులోకి రావడం అదే ప్రథమం. రిజిస్ట్రేషన్ న్స్ శాఖ వెబ్‌సైట్‌లోని డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకుని రెచ్చిపోయాడు. వాటిలో ఉండే వ్యక్తి పేరు, ఆధార్ నెంబర్, వేలిముద్రల్ని తనకు అనుకూలంగా వాడుకున్నాడు. రబ్బర్‌స్టాంపులు తయారు చేసే యంత్రంతో వేలిముద్రల్నే సృష్టించేశాడు. రబ్బర్‌తో వీటిని రూపొందిస్తే ఈ–కేవైసీ యంత్రం రీడ్ చేయట్లేదనే ఉద్దేశంతో పాలిమర్ అనే కెమికల్‌ను వాడి వేలిముద్రలు తయారు చేశాడు. ఈ వివరాలతో ఈ–కేవైసీ యంత్రాన్నీ ఏమార్చి వేల సిమ్‌కార్డులు యాక్టివేట్ చేశాడు. ఇతడిని ఎస్సార్‌నగర్ పోలీసులు పట్టుకున్న తర్వాత వచ్చి విచారించిన ఆధార్ సహా ఇతర విభాగాలకు చెందిన అధికారులు నివ్వెరపోయారు. తాజాగా తెలంగాణ, ఏపీలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ముఠాగా మారి, ఇదే పంథాలో వేలిముద్రలు క్లోనింగ్ చేసి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) దురిజిస్ట్రేషన్ నియోగం చేసి వివిధ బ్యాంకులకు రూ.10 లక్షల మేర టోకరా వేశారు. ‘ముప్పు’ను ఊహించకపోవడమే... ఇలాంటి పెను ఉదంతాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ‘భవిష్యత్తును’ సరిగ్గా అంచనా వేయలేకపోవడమే కారణమని నిపుణులు చెప్తున్నారు. ఏదైనా ఓ విధానం, వెబ్సైట్ తదితరాలు రూపొందించేప్పుడు అనేక కోణాలను పరిశీలించాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే పెద్ద వ్యవస్థలకు చెందిన వారు సైతం కేవలం అప్పటి అవసరాలను, ఎదురవుతున్న సమస్యల్నే దృష్టిలో పెట్టుకుంటున్నారని, భవిష్యత్తులో ఎదురయ్యే వాటిని పట్టించుకోవట్లేదని వివరిస్తున్నారు. ఈ కారణంగానే జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత మాత్రమే నష్టనివారణ, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం సమీప భవిష్యత్తులో ఎన్ని రకాలైన సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది, టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందవచ్చు తదితరాలను అంచనా వేసి చర్యలు తీసుకుంటారని, ఆ దృక్పథం ఇక్కడ లోపించిందని, దీంతోనే ఏదైనా జరిగిన తర్వాతే అవసరమైన చర్యలు తెరపైకి వస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. -
మా డేటా మాదే
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: వెబ్సైట్ల హ్యాకింగ్‌తో విద్యుత్ సంస్థలు కళ్లు తెరిచాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సర్వర్లను వేరుచేసే ప్రక్రియను ముమ్మరం చేశాయి. వీలైనంత త్వరగా డేటాను సొంతంగా నిల్వ చేసుకోవాలని భావిస్తున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలోని తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల డేటా హ్యాకింగ్ నేపథ్యంలో తాజా పరిస్థితిని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు గురువారం సమీక్షించారు. డిస్కమ్‌ల వెబ్సైట్లు హ్యాక్ అయినప్పటికీ.. డేటాను తిరిగి పొందే వీలుందని చెబుతున్నారు. వెబ్సైట్లను నిర్వహిస్తున్న టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్)తో డిస్కమ్‌ల సీఎండీలు సంప్రదింపులు జరిపారు. అనంతరం నిర్వహించిన అంతర్గత సమీక్షలో అనేక అంశాలను గుర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలున్నాయి. వీటికి సంబంధించిన డేటాను డిజిటలైజ్ చేసే ప్రక్రియ 2012లోనే ప్రారంభమైంది. 2015లో టీసీఎస్‌తో ఒప్పందం చేసుకున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు ఇచ్చింది. అప్పట్లో ప్రైవేట్ సంస్థకు దీని నిర్వహణ బాధ్యతను అప్పగించాయి. వీటికి సంబంధించి సర్వర్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. బ్యాకప్ మాత్రం తిరుపతిలోని దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. ప్రస్తుతం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సంస్థ కాంట్రాక్ట్ గడువు ఈ ఏడాదితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ డిస్కమ్‌లు సొంతంగా డేటా స్టోరేజి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంపై రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదిక (డీపీఆర్) కూడా పూర్తి చేసినట్టు డిస్కమ్‌ల సీఎండీలు తెలిపారు. భద్రతలో లోపాలున్నాయా? రెండేళ్ల క్రితం దక్షిణ ప్రాంత పరిధిలో ఆన్లైన్ టెండర్లు లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి. అత్యంత రహస్యంగా నిర్వహించాల్సిన ఈ ప్రక్రియను పోటీ సంస్థలకు లీక్ చేయడంపై దుమారం రేగింది. అప్పట్లో సాంకేతిక కమిటీ వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. కోట్లాది రూపాయల కాంట్రాక్టుల వివరాలు లీకవ్వడంపై కమిటీ ఎలాంటి వివరాలను సేకరించలేకపోయింది. డేటా మొత్తం ప్రైవేట్ సంస్థ చేతుల్లో ఉండటం వల్లే ఈ సమస్య తలెత్తిందనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా వెబ్సైట్ హ్యాక్ కావడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. మరోవైపు వెబ్ డేటా తెలంగాణలో ఉండటం వల్ల భద్రత లేదని అధికారులు భావిస్తున్నారు. అక్కడి సర్వర్లపై తెలంగాణ సంస్థలకే పూర్తి అధికారం ఉండటం కూడా సమస్యగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ ఆన్లైన్ సేవలకు బ్రేక్ అంతర్జాతీయ హ్యాకర్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడంతో ఆ సంస్థకు సంబంధించిన ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఆన్లైన్లో సొమ్ము చెల్లించే వారికి ఇబ్బంది తలెత్తింది. డిస్కంల వెబ్సైట్లు హ్యాక్ అయి అప్లికేషన్ సర్వర్‌కు వైరస్ ఇంజెక్ట్ అయినట్టు తెలుసుకున్న అధికారులు ముందుజాగ్రత్త చర్యగా వాటి లింకు కట్ చేశారు. అప్పట్నుంచి ఇతర డిస్కంలతోపాటు ఈపీడీసీఎల్ వెబ్సైట్ కూడా ఆన్లైన్లో కనిపించడం లేదు. ఈ వెబ్సైట్ ద్వారా మన రాష్ట్రంలో రోజుకు సగటున 10 వేల లావాదేవీలు జరుగుతున్నాయి. హ్యాకింగ్ వల్ల మూడు రోజులుగా ఆన్లైన్ చెల్లింపులు స్తంభించిపోయాయి. ఈపీడీసీఎల్ డేటాను వేరే సర్వర్‌లో ఉంచామని, అందువల్ల డేటాకు వచ్చిన ముప్పు లేదని ఈపీడీసీఎల్ జనరల్ మేనేజర్ (ఐటీ) శ్రీనివాసమూర్తి ‘సాక్షి’కి చెప్పారు. మరో రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. హ్యాక్ అయిందా..డేటా చెరిపేశారా? వెబ్సైట్ల హ్యాకింగ్ నేపథ్యంలో విద్యుత్ సంస్థల్లో అనేక వాదనలు విన్పిస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థల్లో ప్రధానంగా టెండర్ల వివరాలు, విద్యుత్ బిల్లుల వివరాలు మాత్రమే ఉంటాయి. హ్యాకర్లకు దీనివల్ల ప్రయోజనం ఏమిటనే వాదన తెరమీదకొచ్చింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్న నేపథ్యంలో.. కొత్త ప్రభుత్వం వస్తే విద్యుత్ శాఖలోని అక్రమాలపై విచారణ జరిపే వీలుంది. డిస్కమ్‌ల పరిధిలో గత ఐదేళ్లుగా అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. ఇటీవల కవర్డ్ కండక్టర్ల కుంభకోణంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రమేయం ఉందనే ఆరోపణలు బయటకొస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విలువైన సమాచారం తొలగించే ప్రయత్నం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాకప్ డేటా ఉన్నప్పటికీ, అవసరమైన డేటాను తొలగించి, ఇతర డేటాను తిరిగి స్టోర్ చేసే వీలుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలకు ఎంతమాత్రం అవకాశం లేదని డిస్కమ్‌ల సీఎండీలు కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా హ్యాకింగ్‌పై పూర్తిస్థాయి విచారణ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఏకంగా దేశ అధ్యక్షుడికే వార్నింగ్ ఇచ్చాడు!
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు ఓ విద్యార్థి షాకిచ్చాడు. ఏకంగా ఆయన అధికారిక వెబ్ సైట్ హ్యాక్ చేయడంతో పాటు కొన్ని డిమాండ్లతో కూడిన వార్నింగ్ ఇవ్వడం అక్కడ కలకలం రేపింది. ఆ విద్యార్థిని లంక పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ విద్యార్థికి దాదాపు మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ. 3లక్షలు ఫైన్ విధించనున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఓ విద్యార్థి జీసీఈ ఆడ్వాన్స్డ్ లెవల్ పరీక్షలు పరీక్షలను వాయిదా వేస్తే బాగుంటుందని భావించాడు. ఇందుకోసం ఏం చేసేందుకైనా వెనకాడకూడదని నిర్ణయించుకున్నాడు. ఏకంగా అధ్యక్షుడు సిరిసేన అధికారిక వెబ్ సైట్ హోమ్ పేజీని తొలగించి తన డిమాండ్లను ఆ పేజీలో కనిపించేలా చేశాడు. పరీక్షలను ప్రస్తుతం నిర్వహించవద్దని.. వీలైతే పరీక్షలకు వాయిదావేయాలని, లేకపోతే పదవి నుంచి తప్పుకోవాలని తన డిమాండ్లలో పేర్కొన్నాడు. ఇది తెలుసుకున్న అధికారులు, పోలీసులు ట్రాకింగ్ ద్వారా కడుగన్నావాలో ఆ విద్యార్థి ఇంటికెళ్లి అరెస్టుచేశారు. రాజధాని కొలంబో నుంచి ఆ గ్రామం 100కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ లంక ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయని, అయితే తొలిసారిగా ఓ యువకుడిని సైబర్ క్రైమ్ యాక్ట్-2007 కింద అదుపులోకి తీసుకున్నామని వివరించారు. విద్యార్థి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. -
క్యాంపస్‌లో మొరిగితే ఏం ఉపయోగం?
తీవ్ర వివాదాల్లో కూరుకుపోయిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ వెబ్సైట్ హ్యాక్ అయింది. 'జేఎన్‌యూ క్యాంపస్‌లో మొరిగితే మీకు కశ్మీర్ వస్తుందని భావిస్తున్నారా' అనే మెసేజి దానిమీద కనిపించింది. పార్లమెంటు మీద దాడి చేసిన అఫ్జల్‌గురు ఉరితీతకు నిరసనగా యూనివర్సిటీలో కార్యక్రమాలు జరిగిన నేపథ్యంలో వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. 'బ్లాక్ డ్రాగన్' అనే పేరుతో దీన్ని హ్యాకింగ్ చేసినట్లు చెప్పుకొన్నారు. ''కశ్మీర్‌కు స్వాతంత్ర్యం వచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని అంటున్నారు.. జేఎన్‌యూ క్యాంపస్‌లో మొరిగినంత మాత్రాన మీకు కశ్మీర్ వస్తుందని అనుకుంటున్నారా'' అని రాశారు. వెబ్సైట్ హ్యాక్ అయిన విషయాన్ని ఆఫీసు సమయం ముగిసిన తర్వాత గమనించామని, యూనివర్సిటీ ఐటీ శాఖకు ఈ విషయం తెలియజేశామని, వాళ్లు తగిన చర్యలు తీసుకుంటారని వర్సిటీ అధికారులు తెలిపారు. -
విక్రమ సింహపురి పాత వెబ్సైట్ హ్యాకింగ్
-
విక్రమ సింహపురి పాత వెబ్సైట్ హ్యాకింగ్
నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీ పాత వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సింహపురియునివి.ఓఆర్జీ)ని గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి విద్యార్థులను మోసగిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ విషయం గుర్తించిన వర్సిటీ అధికారులు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు..నెల్లూరులోని విక్రమ సింహపురి వర్సిటీ 2008లో అధికారిక www.simhapuriuniv.org ని ప్రారంభించింది. దాని పర్యవేక్షణ హైదరాబాద్‌కు చెందిన ఐసీఎం స్పాట్ సంస్థ చేస్తోంది. 2012లో వెబ్సైట్లో మార్పులు చేర్పులు చేసి పాత వెబ్‌సైట్‌కు బదులుగా www.simhapuriuniv.ac పేరిట కొత్త వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. పాత వెబ్‌సైట్‌ను తొలగించాలని ఎడ్యుకేషన్ రీసెర్చ్ నెట్(ఈఆర్ఎన్ఈటీ)ని వర్సిటీ రిజిస్ట్రార్ కోరారు. అప్పటినుంచి ఆ వెబ్సైట్ గురించి అధికారులు పట్టించుకోలేదు. గతేడాది అక్టోబర్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి వర్సిటీ పాత వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశాడు. అందులో నకిలీ మెయిల్ క్రియేట్ చేసి 116 కోర్సులను వర్సిటీ నిర్వహిస్తోందని, అందుకు సంబంధించిన ఫీజు వివరాలను అందులో పొందుపరిచాడు. అంతేకాకుండా చిరునామా, సెల్‌ఫోను నంబర్లు అందుబాటులో ఉంచాడు. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరస్పాండెన్స్ కోర్సుల్లో చేరేందుకు ఆ నంబర్లను సంప్రదించారు. వారి నుంచి సదరు హ్యాకర్ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసి నకిలీ సర్టిఫికెట్లు జారీచేశాడు. అయితే ఓ విద్యార్థి అనుమానంతో వర్సిటీ అధికారులను సంప్రదించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ పాత వెబ్‌సైట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎస్.మురళీమోహన్‌రెడ్డి ఒకటో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు వరంగల్‌లో ఐడీని క్రియేట్ చేశాడనీ, తన కార్యకలాపాలు బెంగళూరు, హార్యానా నుంచి సాగిస్తున్నాడని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. -
‘సీడీఎంఏ’ వెబ్సైట్ హ్యాకింగ్
హైదరాబాద్/గోదావరిఖని, న్యూస్‌లైన్: కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)కు చెందిన అధికారిక వెబ్‌సైట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాకింగ్ చేశారు. వెబ్సైట్లోకి అక్రమంగా చొరబడి అందులో ఉన్న సమాచారాన్ని తొలగించారు. ముఖ్యంగా సర్క్యులర్ విభాగంలో ఉండాల్సిన ప్రభుత్వ సర్క్యులర్లు అన్నింటినీ కనిపించకుండా చేశారు. సర్క్యులర్ సబ్జెక్ట్‌ను తెలియజేసే చోట ‘పాకిస్థాన్ జిందాబాద్... హాక్డ్ అనౌన్ కాప్... షాక్డ్..?’ తదితర పదాలతోపాటు బూతు పదాలను చేర్చారు. ఈనెల 18న రాత్రి 8.30 గంటలకు హ్యాకింగ్ చేసినట్టు తెలుస్తోంది. గుజరాత్ నుంచి ఒకరు ఈ సమాచారాన్ని కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమాచారాన్ని అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు మధ్యాహ్నం పనెన్నండున్నర గంటల సమయానికల్లా అనుచిత వ్యాఖ్యలను తొలగించి, వెబ్‌సైట్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని పారదర్శకంగా ఉండేందుకు వీలుగా అన్ని సర్క్యులర్లను, ప్రభుత్వ ఉత్తర్వులను, తమ వెబ్సైట్లో పొందుపరుస్తున్నామని, అలాంటి తమ వైబ్‌సైట్ హ్యాకింగ్ కావడం విచిత్రంగా ఉందని కమిషనర్ బి. జనార్దన్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. తమకు సమాచారం అందగానే..ఆ అంశాలను తొలగించి వెబ్‌సైట్‌ను తిరిగి యథావిధంగా వినియోగంలోకి తెచ్చామన్నారు.