
సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారికి వేధింపులు
త్రివేండ్రం: కేరళకు చెందిన సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారి శ్రీలేఖ ఆర్.. సహచర అడిషనల్ డీజీపీ ర్యాంక్ అధికారిపై సంచలన ఆరోపణలు చేశారు. కేరళ ట్రాన్స్పోర్ట్ అడిషనల్ డీజీపీ తొమిన్ జే తంచన్గెరీ తనను 29 ఏళ్లుగా వేధిస్తున్నారని శ్రీలేఖ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. బస్ కుంభకోణం కేసు విజిలెన్స్ విచారణలో శ్రీలేఖ పేరు చేర్చిన తర్వాత తొమిన్పై ఆరోపణలు చేశారు.
కేరళ ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లేలా ప్రైవేట్ బస్సులకు శ్రీలేఖ పర్మిట్లను మంజూరు చేశారని కేసు నమోదైంది. ఈ బస్ కుంభకోణంపై విజిలెన్స్ కోర్టు విచారణ ప్రారంభించింది. అయితే ఈ కుంభకోణంలో తన పాత్ర లేదని, తన ప్రతిష్టను దిగజార్చేందుకు తొమిన్ కుట్రపన్ని కేసులో ఇరికించారని శ్రీలేఖ ఆరోపించారు. కాగా శ్రీలేఖ చేసిన ఆరోపణలు నిరాధారమని తొమిన్ తోసిపుచ్చారు.