న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 59 శాతం రైతులకు రుణ పథకాలు అందడం లేదని ఓ సర్వేలో వెల్లడైంది. రుణ పథకాల సమాచారం వారికి అందనందునే ఇలా జరుగుతోందని వివరించింది. ‘గావ్ కనెక్షన్’ అనే స్వచ్ఛంద సంస్థ తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్ సహా 19 రాష్ట్రాల్లోని 18 వేల మంది రైతులను సర్వే చేసి ఈ విషయాలను గుర్తించింది. ప్రతి ఐదుగురు రైతుల్లో ఒకరు వాతావరణ మార్పుల కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు తేల్చింది. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రవమైన, వడగండ్ల వర్షాలు కారణంగా దేశవ్యాప్తంగా లక్షల మంది అన్నదాతలు సవాళ్లు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.
ఉత్పత్తులకు సరైన ధర రావడం లేదని 43.6 శాతం మంది, పంట ధరలను నిర్ణయించే వెసులుబాటు తమకే ఉండాలని 62 శాతం మంది రైతులు అభిప్రాయపడ్డారు. అధిక రుణాల కారణంగా ఇబ్బందులు పడుతున్నట్టు 13 శాతం మంది పేర్కొన్నారు. సాగు సమాచారం కోసం ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి వాటిని ఉపయోగిస్తామని 38 శాతం మంది రైతులు తెలిపారు. రైతు కుటుంబాల్లో తర్వాతి తరం వారు వ్యవసాయం చేయడానికి 48 శాతం మంది ఇష్టపడటం లేదని సర్వే తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment