ముంబై: మరో నాలుగేళ్లలో తమ రాష్ట్రంలో 56 లక్షల టాయిలెట్లను నిర్మించాలని మహారాష్ట్ర సర్కార్ తలపించింది. 2019నాటికి ఇది పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి అందరి ఇళ్లలో మరుగుదొడ్లు ఉంటాయని నీటి సరఫరా శాఖ మంత్రి బాబన్ రావ్ లోనికార్ విలేకరులకు తెలిపారు. స్వచ్ఛమైన పరిపాలన అందించడంతోపాటు మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దాని సహాయంతోనే ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పారు.
గతంలో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.నాలుగువేలు చెల్లించగా దానిని ప్రస్తుతం రూ.12వేలకు పెంచినట్లు తెలియజేశారు. గ్రామాల్లో ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు, ఈ పనులు పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక రాయభారి బృందాన్ని ఏర్పాటుచేస్తామని, వారిలో సగంమంది మహిళలు ఉంటారని ఆయన తెలిపారు.
56 లక్షల టాయిలెట్లకు 'మహా' నిర్ణయం
Published Thu, Apr 2 2015 11:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM
Advertisement