Maha govt
-
కీలక పరిణామం.. ఎన్సీపీలో మళ్లీ చీలిక..?
ముంబయి: మహారాష్ట్రలో రాజకీయాలు ఇటీవల కీలక మలుపులు తీసుకుంటున్నాయి. రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇటీవల రెండుగా చీలిన విషయం తెలిసిందే. కొంత మంది నేతలతో అజిత్ పవార్.. ఎన్సీపీని చీల్చి ఎన్సీయేతో కలిసి ఉపముఖ్యమంత్రి పదవి పొందారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఓ వర్గం కాగా.. శరద్ పవార్ నాయకుడిగా ఎన్సీపీ మరో వర్గంగా ఏర్పడ్డారు. అయితే.. తాజాగా శరద్ పవార్ అధినేతగా ఉన్న ఎన్సీపీలో జయంత్ పాటిల్ రూపంలో మళ్లీ తిరుగుబాటు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జయంత్ పాటిల్ తిరుగుబాటు చేయనున్నారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో జయంత్ పాటిల్ పార్టీ మారనున్నారని పుకార్లు ఎక్కువయ్యాయి. ఆదివారం ఉదయం జరిగిన భేటీలో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. జయంత్ పాటిల్‌తో పాటు రాజేశ్ తోపే పేరు కూడా ఇందులో వినిపిస్తోంది. రాష్ట్రంలో సంగాలీ స్థానం నుంచి తనకు ఎంపీ టికెట్టు, తన కుమారునికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని జయంత్ పాటిల్ డిమాండ్ చేసినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే ఎన్డీయేలో కలుస్తారని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే పుణె జిల్లాల్లోని నాలుగు స్థానాలకు సంబంధించిన నాయకులతో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలోనే అమిత్ షాతో జయంత్ పాటిల్ కలిసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఊహాగానాలను జయంత్ పాటిల్ కొట్టిపారేశారు. తాను అమిత్ షాతో కలవలేదని స్పష్టం చేశారు. శరద్ పవార్‌కు విధేయుడిగానే ఉంటానని పేర్కొన్నారు. #WATCH | Maharashtra NCP (Sharad Pawar faction) President Jayant Patil on reports that he met Union Home Minister Amit Shah yesterday; says, "Who told you this? (that I met Amit Shah) You should ask those who are saying all this. Last evening I was there at the residence of… pic.twitter.com/CkJHnEFZIR — ANI (@ANI) August 6, 2023 ఇదీ చదవండి: దేశంలో 508 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన -
సుప్రీంకోర్టులో ఉద్ధవ్ థాక్రేకు షాక్.. సీఎం షిండేకు ఊరట..!
సాక్షి, న్యూఢిల్లీ: శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. అంతేకాదు ఈ పిటిషన్‌పై విచారణ జరిగేవరకు షిండే వర్గంలోని 16 మంది రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని న్యాయస్థానం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సూచించింది. పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన 16 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఎటూ తేలకముందే మహారాష్ట్రలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ షిండేను ఆహ్వానించారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని థాక్రే వర్గం గతవారం సుప్రీంను ఆశ్రయించింది. ఈ 16 మంది బలపరీక్షతో పాటు స్పీకర్ ఎన్నిక ఓటింగ్‌లోనూ పాల్గొన్నారని పేర్కొంది. వారి అనర్హత వేటు విషయంపై సుప్రీంకోర్టే తీర్పు చెప్పాలని కోరింది. అయితే ఈ పిటిషన్‌పై సోమవారమే విచారణ జరుగుతుందని థాక్రే వర్గం భావించింది. కానీ లిస్టింగ్‌లో ఇది కన్పించలేదు. దీంతో పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని థాక్రే వర్గం కోరింది. అయితే దీన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాల్సి ఉందని, కొంత సమయం పడుతుందని కోర్టు తెలిపింది. ఆ తర్వాతే విచారణ చేపడతామని చెప్పింది. మంగళవారం కూడా థాక్రే పిటిషన్‌పై విచారణ జరిగే సూచనలు కన్పించడం లేదు. చదవండి: O. Panneerselvam: పన్నీర్ సెల్వానికి భారీ షాక్.. పళనికి పార్టీ పగ్గాలు -
మళ్లీ ‘మహా’ రగడ
సాక్షి ముంబై: మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం, గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ మధ్య మరో వివాదం రాజుకుంది. ప్రభుత్వ విమానంలో గవర్నర్ ప్రయాణించేందుకు రాష్ట్ర సర్కారు గురువారం అనుమతి నిరాకరించింది. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు డెహ్రాడూన్‌కు వెళ్లడానికి సిద్ధమైన గవర్నర్ ముంబై ఎయిర్‌పోర్టులో విమానంలో కూర్చున్న అనంతరం అనుమతి లేదని అధికారులు తేల్చిచెప్పారు. దాదాపు రెండు గంటల తర్వాత ప్రైవేట్ విమానంలో గవర్నర్ డెహ్రాడూన్‌కు బయల్దేరారు. ప్రభుత్వ అధికారిక విమానంలో గవర్నర్ ప్రయాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గవర్నర్ పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. మా తప్పేమీ లేదు: సీఎం ఆఫీస్ ప్రభుత్వ విమానంలో గవర్నర్ ప్రయాణించేందుకు ఇంకా అనుమతి లభించలేదని, ఈ విషయాన్ని రాజ్‌భవన్‌కు ముందే తెలియజేశామని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. గవర్నర్‌కు ఇబ్బంది కలిగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని పేర్కొంది. ప్రయాణంపై 10 రోజుల క్రితమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని గవర్నర్ కార్యాలయం తెలియజేసింది. -
56 లక్షల టాయిలెట్లకు 'మహా' నిర్ణయం
ముంబై: మరో నాలుగేళ్లలో తమ రాష్ట్రంలో 56 లక్షల టాయిలెట్లను నిర్మించాలని మహారాష్ట్ర సర్కార్ తలపించింది. 2019నాటికి ఇది పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి అందరి ఇళ్లలో మరుగుదొడ్లు ఉంటాయని నీటి సరఫరా శాఖ మంత్రి బాబన్ రావ్ లోనికార్ విలేకరులకు తెలిపారు. స్వచ్ఛమైన పరిపాలన అందించడంతోపాటు మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దాని సహాయంతోనే ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పారు. గతంలో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.నాలుగువేలు చెల్లించగా దానిని ప్రస్తుతం రూ.12వేలకు పెంచినట్లు తెలియజేశారు. గ్రామాల్లో ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు, ఈ పనులు పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక రాయభారి బృందాన్ని ఏర్పాటుచేస్తామని, వారిలో సగంమంది మహిళలు ఉంటారని ఆయన తెలిపారు.