
కోల్‌కతా: హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గంలో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికుడొకరు చురుగ్గా స్పందించి రైలు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో ముప్పు వాటిల్లలేదు. పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. రైలు పట్టాలకు ఉండే ఫిష్‌ప్లేట్లు ఊడిపోవడాన్ని గమనించిన స్థానిడొకరు వెంటనే స్పందించి ఎరుపు రంగు వస్త్రాన్ని చేత్తో చూపిస్తూ అటుగా వస్తున్న రైలుకు ఎదురెళ్లాడు.
ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. సడన్‌గా రైలు నిలిచిపోవడంతో ఏం జరిగిందోనని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పట్టా విరిగిన ప్రాంతానికి కొన్ని మీటర్ల దూరంలో రైలు ఆగడంతో ప్రమాదం తప్పిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి అప్రమత్తంగా వ్యవహరించిన స్థానికుడికి ప్రయాణికులు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ ఘటనపై రైల్వే శాఖ ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment