‘నా ఎంపీలను బీజేపీ జైలులో పెడుతోంది’
కోల్‌కతా: తన పార్టీ ఎంపీలందరినీ బీజేపీ జైలులో పెడుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీ రాజకీయ కక్ష తీర్చుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కలిసి రావాలని కోరారు.
‘ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతుందో మున్ముందు అలా జరగనివ్వొద్దు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని నేను కోరుతున్నాను. బీజేపీని ఓడించడమే నా లక్ష్యం అని చెప్పారు. తన పార్టీ ఎంపీలను జైలులో పెట్టేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీల కలయిక విషయంలో తనది ఎప్పుడూ ఒకటే ఆలోచని అని, రాజ్యాంగం ప్రకారం దేశంలో సమాఖ్య వ్యవస్థను మరింత ధృడంగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.