జైపూర్లో మెట్రో రైలు షురూ
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్లో మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే మెట్రో రైలును ప్రారంభించారు. భారత్లో ఇప్పటి వరకు ఐదు నగరాల్లో మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు జైపూర్ వీటి సరసన చేరింది.