
యాంటెన్నా విప్పుకొన్న మామ్...
బెంగళూరు: అంగారకుడిపై పరిశోధనల కోసం ఇస్రో గత నవంబరు 5న పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్-మంగళ్‌యాన్) ఉపగ్రహం తన ‘మీడియం గెయిన్ యాంటెన్నా’ను విజయవంతంగా విప్పుకొంది. అంగారకుడి కక్ష్యలోకి చేరేటప్పుడు కీలకమైన ఈ యాంటెన్నా ద్వారానే మామ్ భూమికి సమాచారం పంపనుంది.
అలాగే మార్స్ దిశగా మామ్ ప్రయాణం మరో 14 శాతమే మిగిలి ఉందని, మరో 49 రోజుల్లో (సెప్టెంబరు 24న) ఉపగ్రహం అంగారకుడి కక్ష్యలోకి చేరనుందని ఇస్రో ఈ మేరకు గురువారం తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొంది. ప్రస్తుతం ఉపగ్రహం సరైన దిశలోనే ప్రయాణిస్తోందని, మార్గసవరణ చేపట్టాల్సిన అవసరం లేదని తెలిపింది.