ఉగ్రవాదుల్లో చేరి.. ఇంటికి తిరిగొచ్చాడు! | Mumbai youth joins Islamic State in Iraq, returns to India | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల్లో చేరి.. ఇంటికి తిరిగొచ్చాడు!

Published Fri, Nov 28 2014 2:48 PM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

ఉగ్రవాదుల్లో చేరి.. ఇంటికి తిరిగొచ్చాడు!

ఉగ్రవాదుల్లో చేరి.. ఇంటికి తిరిగొచ్చాడు!

ఇంటిని, కనిపెంచిన అమ్మానాన్నలను వదిలిపెట్టి ఉగ్రవాదులుగా మారిపోడానికి ఇరాక్ వెళ్లి, ఐఎస్ఐఎస్లో చేరిన నలుగురు యువకుల్లో ఒకరు భారతదేశానికి తిరిగొచ్చారు. ముంబైకి చెందిన ఆరిఫ్ మజీద్ ఇలా ఇరాక్, అక్కడినుంచి టర్కీ వెళ్లగా అతడిని టర్కీ నుంచి వెనక్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఈనెల మొదట్లోనే మజీద్ తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, ఇంటికి తిరిగి వచ్చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఇంతకుముందు ఆగస్టులోనే అతడు చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు ఫోన్ రావడంతో, ఇన్నాళ్ల నుంచి అతడు లేడనే వారు అనుకున్నారు. ఎట్టకేలకు తిరిగి రావడంతో కాస్త సంతోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement