mumbai youth
-
ఐఎస్ఐఎస్లో ముంబై యువకులు!
ముంబై: ముంబైకి చెందిన ముగ్గురు యువకులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపులో చేరినట్టు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా కనిపించకుండాపోయిన అయాజ్ సుల్తాన్ (23), మోసిన్ షేక్ (26), వాజిద్ షేక్ (25) ఐఎస్‌లో చేరినట్టు భావిస్తున్నామని, ఈ విషయపై దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు కూడా పశ్చిమ ముంబైలోని మాల్వానీ ప్రాంతానికి చెందినవారు. కనిపించడం లేదని ఈ ముగ్గురు యువకుల తల్లిదండ్రులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిని అతివాద భావజాలంతో ప్రభావితం చేసి ఐఎస్‌లో చేరాలే ప్రేరేపించారని, వీరిలో సుల్తాన్ అక్టోబర్ 30 నుంచి అదృశ్యమవ్వగా, మిగతా ఇద్దరు ఈ నెల 16 నుంచి కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. కువైట్‌కు చెందిన సంస్థ నుంచి ఉద్యోగం ఆఫర్ వచ్చిందని, ఇందుకోసం పుణె వెళ్లాలని సుల్తాన్ ఇంట్లో చెప్పగా, స్నేహితుడి పెళ్లికి వెళుతానని చెప్పి మోసిన్, ఆధార్ కార్డు మీద పేరు సరిచేసుకోవడానికి వెళుతున్నానని వాజిద్ ఇంటి నుంచి బయటకొచ్చేశారు. ప్రస్తుతం ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) వారి ఈమెయిల్ పాస్వర్డ్లు సాధించి.. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నదని పోలీసులు తెలిపారు. -
భారత్‌పై దాడికి ఐఎస్ కుట్ర?
ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరి.. స్వదేశానికి తిరిగొచ్చిన ముంబై యువకుడు అరీబ్ మజీద్‌ను అరెస్టు చేసి, ఎనిమిది రోజులు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించారు. కొన్నాళ్ల పాటు ఇస్లామిక్ స్టేట్ సంస్థ తరఫున ఉగ్రవాదంలో పాల్గొన్న తర్వాత మజీద్ తిరిగి రాగానే అతడిని అరెస్టు చేశారు. అతడిని ఎన్ఐఏతో పాటు మహారాష్ట్ర ఏటీఎస్ కూడా విచారిస్తోంది. అతడి సహచరుల గురించిన మరిన్ని వివరాలు ఎన్ఐఏకు అందుతున్నాయి. మజీద్ బాగా తీవ్ర భావాలతో ఉన్నాడని, ఇస్లామిక్ స్టేట్‌లో ఉండగా తాను చేసిన పనులకు ఏ మాత్రం బాధపడటం లేదని ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. అసలు ఇస్లామిక్ స్టేట్ నుంచి అతడు తిరిగి రావడం వెనక ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా ఎన్ఐఏ, మహారాష్ట్ర ఏటీఎస్ వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. భారతదేశంలో ఆ ఉగ్రవాద సంస్థ తరఫున ఏమైనా ఆపరేషన్లు చేపట్టడానికి వచ్చాడేమోనని కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అన్ని కోణాల్లోనూ ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. భారతదేశంపై ఐఎస్ ప్రభావం కొంత ఆందోళన కలిగించేదేనని గువాహటి పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అన్నారు. అయిఏత, మన భద్రతా దళాలు ఎలాంటి కుట్రలనైనా ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
ఉగ్రవాదుల్లో చేరి.. ఇంటికి తిరిగొచ్చాడు!
ఇంటిని, కనిపెంచిన అమ్మానాన్నలను వదిలిపెట్టి ఉగ్రవాదులుగా మారిపోడానికి ఇరాక్ వెళ్లి, ఐఎస్ఐఎస్లో చేరిన నలుగురు యువకుల్లో ఒకరు భారతదేశానికి తిరిగొచ్చారు. ముంబైకి చెందిన ఆరిఫ్ మజీద్ ఇలా ఇరాక్, అక్కడినుంచి టర్కీ వెళ్లగా అతడిని టర్కీ నుంచి వెనక్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈనెల మొదట్లోనే మజీద్ తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, ఇంటికి తిరిగి వచ్చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఇంతకుముందు ఆగస్టులోనే అతడు చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు ఫోన్ రావడంతో, ఇన్నాళ్ల నుంచి అతడు లేడనే వారు అనుకున్నారు. ఎట్టకేలకు తిరిగి రావడంతో కాస్త సంతోషిస్తున్నారు.