ముంబై: గాజాలో జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా ముంబైలో ఉగ్ర దాడికి పాల్పడతామంటూ ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియాకు బెదిరింపు లేఖ అందింది. ‘1993లో మీకు (మారియా) అవకాశం వచ్చింది. కానీ ఈసారి కుదరదు. దమ్ముంటే మమ్మల్ని ఆపండి’’ అంటూ ముజాహిదీన్ అనే సంతకంతో హిందీ, ఆంగ్లంలో పంపిన లేఖలో రాసి ఉంది. దీంతో ముంబైలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. 1993 నాటి ముంబై పేలుళ్ల కేసును నాడు డీసీపీ హోదాలో మారియా దర్యాప్తు చేశారు.