మహారాష్ట్రలోని పుల్గావ్ ఆయుధాగారంలో మంటలు, పేలుళ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించారు. రక్షణమంత్రి మనోహర్ పారికర్‌ను వెంటనే అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా కోరానని ఆయన తెలిపారు. మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ కూడా పుల్గావ్‌కు బయల్దేరారు. అక్కడ మంటలు, పేలుళ్లలో దాదాపు 20 మంది మరణించి, మరో 19 మంది వరకు గాయపడిన విషయం తెలిసిందే.
తనకు తెలిసిన సమాచారం ప్రకారం మంటలు అదుపులోకి వచ్చాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. అక్కడకు కావల్సిన సహాయం, వనరులు, ప్రాథమిక వైద్య సదుపాయాలు అన్నీ అం దిస్తున్నామన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, భారీ మొత్తంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఎంతవరకు వీలైతే అంత సాయం చేయాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు.
మహారాష్ట్ర పేలుళ్లపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Published Tue, May 31 2016 11:26 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement