ఎన్నికల్లో అభ్యర్థులకు కొత్త నిబంధన
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఇకపై నామినేషన్ దాఖలు సమయంలో సొంత ఆదాయ మార్గాలతో పాటు జీవిత భాగస్వామివి కూడా వెల్లడించాలి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి ఈ చర్య దోహదపడుతుందని ఎన్నికల సంఘం ఈసీ పేర్కొంది.
ఈమేరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ కేంద్రం...అఫిడవిట్‌లో ప్రత్యేక కాలమ్‌ను కేటాయించింది. ఇప్పటి వరకు అమలవుతున్న నిబంధనల ప్రకారం...అభ్యర్థి తన సొంత ఆస్తులు, అప్పులతో పాటు జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన ముగ్గురి ఆస్తులు, అప్పులను వెల్లడించాలి. ఆదాయ మార్గాలను ప్రకటించనక్కర్లేదు.