బిల్లును సిద్ధం చేస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ: భిక్షాటన నేరంగా పరిగణించకుండా చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. యాచకులకు, ఇళ్లు లేని పేదవారికి మెరుగైన జీవితం, పునరావాసం కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ఈ బిల్లును రూపొందిస్తోంది. ఈమేరకు సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ‘ద పెర్సన్స్ ఇన్ డిస్టిట్యూషన్’(ప్రొటెక్షన్, కేర్, రిహాబిలిటేషన్) మోడల్ బిల్లు 2016ను తయారు చేస్తోంది.
బుధవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమైన సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ వారి నుంచి అభిప్రాయాలు సేకరించింది. పేదరికంలో మగ్గుతున్న వారికి, ఇళ్లు లేనివారికి, యాచకులకు రక్షణ, సంరక్షణ, మద్దతు, ఆవాసం, శిక్షణ మొదలైన సౌకర్యాలు కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం. ఈ సమావేశానికి కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్‌చంద్ గెహ్లట్ అధ్యక్షత వహించారు.
భిక్షాటన నేరం కాదు..!
Published Thu, Oct 20 2016 2:10 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
Advertisement
Advertisement