పాకిస్థాన్ లాహోర్ నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 100 మంది ప్రయాణికులలో పాకిస్థానీ విమానం బయలుదేరింది. ఆ బయలుదేరిన కొద్ది సేపటికే విమానంలో ఇంధనం లేదన్న సంగతి పైలేట్లు ఆలస్యంగా గ్రహించారు. అప్పటికే ఆ విమానం భారత్ భూభాగంలోకి ప్రవేశించి... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దాంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పాకిస్థానీ పైలేట్లు లక్నోలోని విమానాశ్రయ ఏటీసీ అధికారులను సంప్రదించారు.
విమానంలో ఇంధన కొరత తీవ్రంగా ఉందని... 100 మంది ప్రయాణికులు ఉన్నారని... ఈ నేపథ్యంలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ కావాలని పరిస్థితిని పైలేట్లు లక్నో విమానాశ్రయ ఉన్నతాధికారులకు వివరించారు. దాంతో చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్ర అధికారులు ఏయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎస్.సి.హోతాకు సమాచారం అందించారు. దీంతో విమానం దిగేందుకు అంగీకరించారు. విమానం లక్నో ఎయిర్ పోర్ట్లో దిగి ఇంధనం నింపుకుని ఢాకా బయలుదేరి వెళ్లింది.