సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచం డిజిటల్‌మయమైనా పేపర్ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని కేంద్ర సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో పేపర్ పరిశ్రమల 13వ అంతర్జాతీయ సమ్మేళనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సదస్సులో ప్రపంచంలోని 22 దేశాల నుంచి ప్రముఖ సంస్థలు పాల్గొని పేపర్ తయారీలో ఆయా సంస్థలు అనుసరిస్తున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించేలా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశాయి.
ఈ సదస్సును కేంద్ర మంత్రులు హర్షవర్దన్, సీఆర్ చౌదరీ, విజయ్ గోయల్, ఐటీఈటీ డైరెక్టర్ గగన్ సహాని, కేంద్ర పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి వందనా కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో వ్యర్థాల రీసైకిల్ ద్వారా పేపర్ తయారీ, దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనలో పేపర్ పరిశ్రమల పాత్ర వంటి అంశాలపై చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పేపర్ తయారీలో చెట్ల వాడకాన్ని తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి సీఆర్ చౌదరీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment