minister Harsha vardhan
-
మ్యాపింగ్ పాలసీలో కీలక సడలింపులు
న్యూఢిల్లీ: భారత మ్యాపింగ్ పాలసీలో నిబంధనలను సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జియోస్పేషియల్ డేటా నియంత్రణా నియమావళిలో మార్పులు చేయడం ద్వారా ఈ రంగంలో పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు సమానావకాశాలు ఉండేలా చర్యలు తీసుకుంది. కొత్త నిబంధనల్లో భాగంగా ఈ రంగాన్ని డీరెగ్యులేట్ చేయడంతో పాటు సర్వేయింగ్, మాపింగ్, యాప్స్ అభివృద్ధికి ప్రీ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మార్పులు చేసినట్లు సైన్స్అండ్టెక్నాలజీ సెక్రటరీ అశుతోష్ చెప్పారు. దేశీయ సంస్థలు జియోస్పేషియల్ డేటా సేవలందించేందుకు ముందుకు వస్తే ఎలాంటి ముందస్తు అనుమతులు, సెక్యూరిటీ క్లియరెన్సులు, లైసెన్సులు అవసరం లేదన్నారు. జియోస్పేస్ రంగంలో నిబంధనల సడలింపు ఆత్మ నిర్భర్ భారత్‌లో కీలక ముందడుగని ప్రధాని మోదీ అభివర్ణించారు. హైక్వాలిటీ మ్యాప్స్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న పలు రంగాలకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని సైన్స్అండ్టెక్నాలజీ మంత్రి హర్ష వర్ధన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు సర్వే ఆఫ్ ఇండియా సైతం మ్యాపులు తయారు చేయాలంటే పలు ఏజెన్సీల అనుమతులు తీసుకోవాల్సివచ్చేదని గుర్తు చేశారు. ఇంతవరకు నిషిద్ధ జోన్‌గా పేర్కొనే ప్రాంతాల జియోస్పేషియల్ డేటా సైతం ఇకపై అందుబాటులోకి వస్తుందని, అయితే ఇలాంటి సున్నిత ప్రాంతాలకు సంబంధించిన సమాచార వినియోగానికి సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్ తీసుకువస్తామని తెలిపారు. ప్రజా నిధులతో సేకరించే డేటా మొత్తం దేశీయ సంస్థలకు అందుబాటులో ఉంటుందని, కేవలం సెక్యూరిటీ, లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు సేకరించిన డేటా మాత్రం అందుబాటులో ఉండదని వివరించారు. తాజా మార్పులతో 2030 నాటికి రూ.లక్ష కోట్ల విలువైన జియో స్పేషియల్ డేటా అందుబాటులోకి వస్తుందన్నారు. కొత్త నిబంధనలు ఆహ్వానించదగినవని జియోస్పేషియల్ రంగానికి చెందిన ఇస్రి ఇండియా టెక్, జెనిసిస్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు వ్యాఖ్యానించాయి. -
నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను మంత్రి కె.తారకరామారావు కోరారు. జాతీయ ఆరోగ్య భద్రతకు దోహదపడే ఈ ప్రాజెక్టు తెలంగాణతోపాటు యావత్ దేశానికి ఉపయోగపడుతుందని వివరించారు. గురువారం కేంద్ర మంత్రిని పార్లమెంటులో కలుసుకున్న కేటీఆర్.. నిమ్జ్ లక్ష్యాలను వివరించారు. ప్రాణాంతక వ్యాధుల నివారణకు అవసరమైన యాంటిబయోటిక్స్‌ను 84 శాతం వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, వ్యాధి నిరోధక మందుల కోసం భారీ స్థాయిలో ఇతర దేశాలపై ఆధారపడటం దేశానికి తీవ్రమైన సమస్య అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశ ఫార్మా రంగానికి ఉత్తమిచ్చేలా నిమ్జ్‌ను ఏర్పాటు చేయనున్నామని, దీని ఏర్పాటుకు అవసరమైన ఈఐఏ నివేదికను ఇటీవల కేంద్రానికి పంపామని చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్‌లో మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్, ఎఫ్ఐసీసీఐ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 17 వరకు జరగనున్న మైనింగ్ టుడే–2018 సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయాలని హర్షవర్ధన్, మరో మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌లను కేటీఆర్ ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ‘డీఐపీ’ఏర్పాటు చేయండి కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (డీఐపీ) కారిడార్లలో ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. రక్షణ రంగంతో హైదరాబాద్‌కు అనుబంధం ఉందని.. రక్షణ రంగ సంస్థలు, పరికరాల తయారీలో ముందు వరుసలో ఉందని వివరించారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోనూ రాత్రి సమావేశమైన కేటీఆర్ పలు అంశాలపై చర్చించారు. శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. - ఢిల్లీలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన కేటీఆర్ -
పేపర్ పరిశ్రమల అంతర్జాతీయ సమ్మేళనం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచం డిజిటల్‌మయమైనా పేపర్ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని కేంద్ర సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో పేపర్ పరిశ్రమల 13వ అంతర్జాతీయ సమ్మేళనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సదస్సులో ప్రపంచంలోని 22 దేశాల నుంచి ప్రముఖ సంస్థలు పాల్గొని పేపర్ తయారీలో ఆయా సంస్థలు అనుసరిస్తున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించేలా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఈ సదస్సును కేంద్ర మంత్రులు హర్షవర్దన్, సీఆర్ చౌదరీ, విజయ్ గోయల్, ఐటీఈటీ డైరెక్టర్ గగన్ సహాని, కేంద్ర పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి వందనా కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో వ్యర్థాల రీసైకిల్ ద్వారా పేపర్ తయారీ, దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనలో పేపర్ పరిశ్రమల పాత్ర వంటి అంశాలపై చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పేపర్ తయారీలో చెట్ల వాడకాన్ని తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి సీఆర్ చౌదరీ సూచించారు. -
నేటి నుంచి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడంతో పాటు, శాస్త్ర, పరిశోధన రంగాల్లో భారత్ సాధించిన ఘన విజయాలను ప్రపంచానికి తెలిపే లక్ష్యంతో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తమిళనాడు లోని చెన్నైలో 4 రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమాలకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్, సహాయ మంత్రి సుజనా చౌదరి, దేశ, విదేశాల్లోని శాస్త్రవేత్తలు పాల్గొంటారు. ఐఐటీ మద్రాస్‌లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రుల సదస్సు నిర్వహించ నున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అన్నా వర్సిటీలో యువ శాస్త్రవేత్తల కార్యక్రమం ఉంటుందని చెప్పారు. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్లో పార్లమెంట్ టు పంచాయత్, మహిళా సదస్సు, అన్నా వర్సిటీలో శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు ఉంటుందని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారత్ విజయాల ప్రదర్శన అన్నా వర్సిటీలో జరుగుతుంది. -
గుంటూరులో ఎయిమ్స్!
న్యూఢిల్లీ : గుంటూరు జిల్లాలో ఎయిమ్స్ నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ప్రతిపాదించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. కాగా ప్రతి రాష్ట్రంలోనూ 'అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ' (ఎయిమ్స్) ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం... ఆ మేరకు తగిన ప్రాంతాల్లో స్థలాలు గుర్తించాల్సిందిగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరింది. ఎయిమ్స్‌కు స్థలం కేటాయింపులో కొన్ని సమస్యలున్నాయని, ఒక్కో సంస్థ ఏర్పాటు చేయడానికి 200 ఎకరాల దాకా అవసరం అవుతాయని మంత్రి చెప్పారు. ఒక్కో ఎయిమ్స్ కు దాదాపు రూ.1500 కోట్లు వ్యయం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిమ్స్ కోసం గుంటూరు జిల్లాలో స్థలం ప్రతిపాదించిందని తెలిపారు. కాగా కొత్త ఎయిమ్స్ ఏర్పాటు ఎంత కాలంలో చేయాలన్నదానికి సంబంధించి నిర్దిష్ట కాలపరిమితి ఏమీ లేదని ఆయన వివరించారు.