
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడంతో పాటు, శాస్త్ర, పరిశోధన రంగాల్లో భారత్ సాధించిన ఘన విజయాలను ప్రపంచానికి తెలిపే లక్ష్యంతో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తమిళనాడు లోని చెన్నైలో 4 రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమాలకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్, సహాయ మంత్రి సుజనా చౌదరి, దేశ, విదేశాల్లోని శాస్త్రవేత్తలు పాల్గొంటారు. ఐఐటీ మద్రాస్‌లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రుల సదస్సు నిర్వహించ నున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
అన్నా వర్సిటీలో యువ శాస్త్రవేత్తల కార్యక్రమం ఉంటుందని చెప్పారు. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టి ట్యూట్‌లో పార్లమెంట్ టు పంచాయత్, మహిళా సదస్సు, అన్నా వర్సిటీలో శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు ఉంటుందని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారత్ విజయాల ప్రదర్శన అన్నా వర్సిటీలో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment