బిడ్డకు మీరాజ్‌ అని పేరు పెట్టిన యువజంట | Parents Name Their Newborn Baby Mirage In Rajastan | Sakshi
Sakshi News home page

బిడ్డకు మీరాజ్‌ అని పేరు పెట్టిన యువజంట

Published Wed, Feb 27 2019 6:55 PM | Last Updated on Wed, Feb 27 2019 6:58 PM

Parents Name Their Newborn Baby Mirage In Rajastan - Sakshi

సాక్షి, జైపూర్‌: భారత సైన్యంపై ఉన్న అభిమానాన్ని ఓ యువజంట వినూత్నంగా వ్యక్తపరిచింది. గత ఏడాది వివాహం చేసుకున్న జంటకు మంగళవారం తెల్లవారుజామున మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు మీరాజ్‌ రాథోడ్‌ అని నామకరణం చేసి దేశ సైనికులకు తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపింది. బిడ్డ జన్మించిన సమయంలోనే బాలాకోట్‌లో జైషే మహమ్మద్ స్థావరాలపై భారత వైమానికి దళం మిరాజ్ - 2000 యుద్ధ విమనాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.

దీంతో ఆ బిడ్డకు భారత సైన్యం ఉపయోగించిన మిరాజ్ యుద్ధ విమానాల పేరును పెట్టాలని నిర్ణయించుకున్నారు. తమకు పుట్టిన బిడ్డకు చరిత్రాత్మకమైన పేరును పెట్టి తమ దేశభక్తిని చాటుకుని మరికొందరికి ఆదర్శకంగా నిలుస్తోంది రాజస్తాన్‌కు చెందిన యువజంట. అంతేకాకుండా తమ బిడ్డ పెదైన తరువాత ఇండియన్‌ ఆర్మీలోనే చేర్పిస్తామని అతని తండ్రి ఎస్ఎస్‌ రాథోడ్‌ తెలిపాడు. నవశిశువుకు మీరాజ్‌ అని పేరుపెట్టడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తంచేశాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement