పార్లమెంటులో అనిశ్చితి..నేడు అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: గత రెండువారాలుగా పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితికి పుల్‌స్టాప్ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రతిపక్షాలను శాంతపరిచేందుకు సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
లలిత్‌మోదీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ల రాజీనామాలకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అధికార పక్షం చర్చకు సిద్ధమంటుంటే.. ముందు రాజీనామా చేసిన తరువాతే చర్చ అని ఎవరికి వారు భీష్మించుకున్నారు. రెండువారాలైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో అఖిలపక్షాన్ని సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది.