యూవీ పోరాటానికి ‘పే బ్యాక్‌’ మద్దతు | Payback India Join Hands With YouWeCan | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌కు వ్యతిరేకంగా యువరాజ్ సింగ్‌పోరాటం

Published Thu, Mar 12 2020 2:16 PM | Last Updated on Thu, Mar 12 2020 2:18 PM

Payback India Join Hands With YouWeCan - Sakshi

సాక్షి, హైదరాబాద్: పేబ్యాక్ ఇండియా.. క్యాన్సర్ ఫౌండేషన్ ‘యూవీకాన్’తో భాగస్వామ్యానికి ముందుకు వచ్చింది. తద్వారా సీఎస్ఆర్(కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) ఇనిషియేటివ్‌గా, ‘పేబ్యాక్ ఇండియా’ క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు చికిత్సను అందించేందుకు సహాయ సహకారాలు అందించనుంది. క్యాన్సర్‌పై అవగాహనను కల్పించేందుకు కృషి చేయనుంది. వివరాలు.. దేశంలోని అతిపెద్ద మల్టీ-బ్రాండ్ లాయల్టీ ప్రోగ్రాం అయిన ‘పేబ్యాక్’ ఇండియా క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లల చికిత్సకు సహాయపడటానికి ‘యూవీకాన్’ క్యాన్సర్ ఫౌండేషన్‌కు మద్దతిస్తోంది. ఈ ఫౌండేషన్‌ భారతదేశంలో క్యాన్సర్ నియంత్రణకు విస్తృతంగా పనిచేస్తోంది. ‘యూవీకాన్’ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కావడంపై ‘పేబ్యాక్’ ఇండియా సీఎంవో రామకాంత్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. యువరాజ్ సింగ్ చేసిన ఈ గొప్ప ప్రయత్నంలో భాగం కావడం తమకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఫౌండేషన్ వెనుక ఉన్న స్ఫూర్తిని, ప్రజలపై దాని ప్రభావాన్ని తాము గుర్తించామన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకు బాటలు నిర్మించాలనుకుంటున్నామని తెలిపారు. అదే విధంగా 2019లో ‘పేబ్యాక్’ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో మా సంబంధాన్ని మరింత పెంచుతుంద’ని అభిప్రాయపడ్డారు.

‘యువీకాన్’ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, క్రికెటర్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ‘‘పేబ్యాక్ మాతో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో క్యాన్సర్‌ వ్యతిరేక పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. క్యాన్సర్‌ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న మా మిషన్‌లో మరిన్ని కార్పొరేట్‌ సంస్థలు ముందుకు వచ్చి మాతో చేరాలని ఆశిస్తున్నాను. మా ఫౌండేషన్ పొగాకు విరమణ కౌన్సెలింగ్‌ను అందించడంతో పాటు నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌లపై దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని’ తెలిపారు. అలాగే, క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం, జిల్లా స్థాయి సమాజ ఆరోగ్య కేంద్రాలున్నాయి.

దేశవ్యాప్తంగా కార్పొరేట్, కళాశాలలు, కమ్యూనిటీ సెంటర్లు, ఆసుపత్రులలో పొగాకు వ్యతిరేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్ పీడియాట్రిక్ రోగులకు చికిత్సా నిధిని నడుపుతుంది. సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు గృహ ఆదాయం ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 50,000 మందికి పైగా పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారని ఒక అంచనా. అంతేకాకుండా, మన దేశంలో క్యాన్సర్‌కు మరణాల రేటు యుఎస్‌ఎ, యుకె కంటే నాలుగు, ఆరు రెట్లు అధికంగా ఉంటుందని అంచనా వేశారు. ప్రధానంగా అవగాహన లేకపోవడం, ఆలస్యంగా రోగ నిర్ధారణ, సంరక్షణకు సరైన ప్రాప్యత, చికిత్సకు అధిక వ్యయం కావడం వంటి కారణాల వల్ల ఈ వ్యత్యాసం నమోదవుతున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. భారతదేశంలో క్యాన్సర్ చికిత్సకు సగటున రూ. 4-6 లక్షల మధ్య వ్యయం అవుతోంది. కానీ 85% పైగా జనాభాకు ఆ ఖర్చులను భరించే స్థోమత లేదు.

‘పేబ్యాక్’ ఇండియా గురించి..
భారతదేశంలో అతిపెద్ద మల్టీ-బ్రాండ్ లాయల్టీ ప్రోగ్రామ్ ‘పేబ్యాక్’. ఇది అందులోఏని వంద మిలియన్లకు పైగా సభ్యులకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఐసీఐసీఐ బ్యాంక్, బిగ్ బజార్, సెంట్రల్, హోమ్ టౌన్, బ్రాండ్ ఫ్యాక్టరీ, హెచ్‌పీసీఎల్, బుక్‌ మై షో, క్లియర్‌ట్రిప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మరెన్నో భాగస్వాములుగా ఉన్నాయి. భాగస్వాముల విభిన్న పోర్ట్‌ఫోలియోతో, ‘పేబ్యాక్’ సభ్యులు రోజువారీ షాపింగ్‌లో పాయింట్లను సంపాదించవచ్చు. ఆకర్షణీయమైన రివార్డుల కోసం వాటిని రిడీమ్ చేయవచ్చు. ‘పేబ్యాక్’ ఇండియా లాయల్టీ ప్రోగ్రామ్‌లో.. ఉత్తమ భాగస్వామ్యం, సంవత్సరపు ఉత్తమ బిగ్ డేటా అనలిటిక్స్ టీం-2019లో కస్టమర్ ఫెస్ట్ సహా అనేక అవార్డులను అందుకుంది. అలాగే 2018లో బెస్ట్ కార్డ్ బేస్డ్ లాయల్టీ ప్రోగ్రామ్, లాయల్టీ ప్రోగ్రామ్‌లో కస్టమర్ ఫెస్ట్, నార్త్ ఇండియా బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు అందుకుంది. మరింత సమాచారం కోసం www.payback.inను సందర్శించవచ్చు.

యూవీకాన్(YouWeCan) ఫౌండేషన్ గురించి..
‘యువీకాన్’ ఫౌండేషన్‌ను క్యాన్సర్‌ను జయించిన భారతీయ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్థాపించారు. లాభాపేక్షలేని సంస్థగా ఇది పనిచేస్తోంది. క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్, చికిత్సపై దృష్టి సారించిన ఈ ఫౌండేషన్ భారతదేశంలో క్యాన్సర్ నియంత్రణపై విస్తృతంగా పనిచేస్తోంది. గత ఐదేళ్ళలో దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులను అమలు చేసింది. వివిధ రకాల క్యాన్సర్ల కోసం 1,50,000 మందికి పైగా పరీక్షలు చేసింది. క్యాన్సర్ అవగాహన వర్క్‌షాప్‌ల ద్వారా 1,25,000 మంది విద్యార్థులను సూచనలు చేసింది. పొగాకు విరమణపై 24,000 మంది పురుషులకు సలహా ఇచ్చింది. రాబోయే రెండేళ్లలో రొమ్ము క్యాన్సర్‌ కోసం గోవాలో 1,00,000 మంది మహిళలను పరీక్షించేందుకు ఇటీవల గోవా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘యూవీకాన్’ ఆశయం, లక్ష్యాలు, కార్యక్రమాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం www.youwecan.orgను సందర్శించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement