నాలుగేళ్లలో అభివృద్ధిలో ముందంజ: ఆల్ఫోన్స్‌ | Progress in development in four years - alphones | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లలో అభివృద్ధిలో ముందంజ: ఆల్ఫోన్స్‌

Published Mon, Jun 4 2018 1:45 AM | Last Updated on Mon, Jun 4 2018 2:37 AM

Progress in development in four years - alphones - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పడిన నాలుగేళ్ల కాలంలోనే అభివృద్ధిలో రాష్ట్రం అద్భుతమైన పురోగతిని సాధించిందని కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్‌ కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు అందజేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆదివారం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తే అభివృద్ధిలో దేశం ముందడుగు వేస్తుందన్నారు. ఆ దిశగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం పనిచేయాలని ఆయన సూచించారు. అందరికీ తిండి, వైద్యం, విద్య, ఉపాధి లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని, ఈ లక్ష్యసాధనకు అందరూ కలసి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, తెలంగాణ భవన్‌ ఆర్సీ అశోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement