ఓరోజు నా పేరు మార్మోగిపోతుంది! | Prosecutors: Evidence Germanwings co-pilot hid illness | Sakshi
Sakshi News home page

ఓరోజు నా పేరు మార్మోగిపోతుంది!

Published Sun, Mar 29 2015 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

ఓరోజు నా పేరు మార్మోగిపోతుంది!

ఓరోజు నా పేరు మార్మోగిపోతుంది!

డ్యూసెల్‌డార్ఫ్: ‘ఏదో ఒక రోజు నా పేరు మార్మోగుతుంది. ఈ వ్యవస్థనంతా మార్చిపారేసే పని చేస్తా’- జర్మనీ విమానాన్ని ఫ్రాన్స్‌లో కూల్చి 150 మంది ప్రాణాలు బలిగొన్న కోపైలట్ లుబిట్జ్ అన్న మాటలివి! కొద్ది నెలల కిందట తనతో లుబిట్జ్ ఈ మాటలు చెప్పాడని అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్ మరియా వెల్లడించారు. జర్మన్ పత్రిక బిల్డ్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం తెలిపారు.

ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగం చేసే ఈమె.. లుబిట్జ్‌తో కలిసి కిందటేడాది ఐదు నెలలపాటు పనిచేశారు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. లుబిట్జ్ నిద్రలో నుంచి ఉన్నట్టుండి లేచి ‘మనం పడిపోతున్నాం’ అని  అరిచేవాడని,  అతడికి  పీడకలలు వచ్చేవని ఆమె తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement