
అమృత్‌సర్: ప్రముఖ పంజాబీ సూఫీ గాయకుడు, వదాలీ సోదరుల్లో ఒకరైన ఉస్తాద్ ప్యారేలాల్ వదాలీ(75) శుక్రవారం అమృత్‌సర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. ఛాతీలో నొప్పి రావడంతో ప్యారేలాల్‌ను సోమవారం ఇక్కడి ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్పించి వెంటిలేటర్‌పై వైద్యం అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
వదాలీ సోదరులుగా పేరుగాంచిన పురాన్‌చంద్, ప్యారేలాల్ వదాలీలు ‘తూ మానే యా నా మానే’ ‘రంగ్రీజ్ మేరే’ వంటి విజయవంతమైన పాటల్ని ఆలపించారు. సూఫీ సంగీతానికి వీరిద్దరూ చేసిన సేవలకు గుర్తుగా పలు రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులు వీరిని వరించాయి. ప్యారేలాల్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment