
సాక్షి,న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో తరచూ పంచ్‌లు పేల్చుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తాజాగా రాజస్థాన్ సీఎం వసుంధర రాజెను టార్గెట్ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లపై విచారణ చేపట్టరాదన‍్న రాజస్థాన్ సర్కార్ వివాదాస్పద ఆర్డినెన్స్‌ను రాహుల్ తీవ్రంగా తప్పుపట్టారు. పౌర హక్కుల కార్యకర్తల నుంచి పలు విమర్శలు ఎదురైన ఈ నిర్ణయం నేపథ్యంలో రాజస్థాన్ సీఎంపై రాహుల్ విమర్శలతో విరుచుకుపడ్డారు.‘మేడమ్ సీఎం...మనం 21వ శతాబ్ధంలో ఉన్నాం..ఇది 2017..1817 కాద’ని రాజస్థాన్ సీఎం వసుంధర రాజేను ఉద్దేశించి రాహుల్ ట్వీట్ చేశారు.
వివాదాస్పద ఆర్డినెన్స్‌ను వెనక్కితీసుకోవాలని పౌర హక్కుల సంస్థ పీయూసీల్ ఇప్పటికే డిమాండ్ చేసింది. తన అనుమతి లేకుండా రాజస్థాన్‌లోని న్యాయమూర్తులు, మేజిస్ట్రేట్‌లు, ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి విచారణ చేపట్టరాదని వసుంధర రాజె ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించేంతవరకూ ఆరోపణలకు సంబంధించి మీడియా ఎలాంటి కథనాలూ ప్రచురించరాదని కూడా ఈ ఆర్డినెన్స్‌లో పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment