
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ కేసుకు సంబంధించి కాపలాదారే దొంగ అని సర్వోన్నత న్యాయస్ధానం చెప్పిందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. కోర్టుకు భేషరతు క్షమాపణలు చెబుతూ ఆయన బుధవారం అఫిడవిట్ దాఖలు చేశారు. తనపై నమోదైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
గౌరవ న్యాయస్ధానానికి తాను అన్యాపదేశంగా తన ఉద్దేశాన్ని ఆపాదించినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని, తాను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని అఫిడవిట్‌లో రాహుల్ పేర్కొన్నారు. కాగా రఫేల్ ఒప్పందంలో చౌకీదారే దొంగ అంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని రాహుల్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని బీజేపీ నేత మీనాక్షి లేఖి సర్వోన్నత న్యాయస్ధానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment