దమ్ము కొడితే ఉపాధికి పొగ!
పొగ తాగితే ఉద్యోగాలివ్వం
- రాజస్థాన్ విద్యుదుత్పత్తి సంస్థల నిర్ణయం
జైపూర్: పొగరాయుళ్లకు రాజస్థాన్ ప్రభుత్వం షాకిచ్చింది. ధూమపానం/పొగాకు ఉత్పత్తులను వినియోగించే వారికి ఉద్యోగాలు ఇవ్వరాదని రాజస్థాన్ ప్రభుత్వ రంగం విద్యుదుత్పత్తి సంస్థలు నిర్ణయించాయి. త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ కానున్నట్లు ఇంధనశాఖ వర్గాలు తెలిపాయి. పొగాకు ఉత్పత్తులు వాడే వారిని ఉద్యోగాల్లోకి తీసుకోరాద ని పొగాకు నియంత్రణపై ఏర్పాటైన అధికారిక కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై గత నవంబర్‌లోనే ఉత్తర్వులు వెలువడ్డా యి. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో దీన్ని ఇంకా అమలు చేయాల్సి ఉంది. విద్యుదుత్పత్తి సంస్థల్లో ఉద్యోగాల్లో చేరేవారు తాము పొగాకు వినియోగించబోమని డిక్లరేషన్ సమర్పించాలి. పొగాకు నిర్మూలనకు ఇది దోహదపడుతుందని స్వచ్ఛంద సంస్థ ఇనయ ఫౌండేషన్‌కు చెందిన నితీషా శర్మ పేర్కొన్నారు.