రాజీవ్ హంతకులు జైల్లోనే ఉండాలి: సుప్రీం
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకులు జైల్లో ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజీవ్ హంతకులను విడుదల చేయాలంటూ తమిళనాడులోని జయలలిత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ ఆదేశాల ఫలితంగా మురుగన్, పెరారివాలన్, శాంతన్ సహా మొత్తం ఏడుగురు కుట్రదారులు జైల్లోనే ఉండాల్సి వస్తుంది.
రాజీవ్ గాంధీ హత్య కేసును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. రాజ్యాంగ ధర్మాసనం పరిష్కరించాల్సిన పలు సవాళ్లతో ప్రధాన న్యాయమూర్తి జస్టస్ పి.సదాశివం నేతృత్వంలోని బెంచి ఓ జాబితా తయారుచేసింది. రాజీవ్ హంతకులను విడుదల చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా లేక రెండూ కలిసి నిర్ణయం తీసుకోవాలా అన్న విషయాన్ని కూడా నిర్ధారించాలని బెంచి కోరింది.