రిటైరయ్యాక అరుణాచల్‌లో: రాహుల్
అరుణాచల్‌ప్రదేశ్‌లోని సహజసిద్ధమైన ప్రకృతి అందాలు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని మంత్రముగ్ధుడ్ని చేశాయి. ఎంతగా అంటే.. రాజకీయాల నుంచి రిటైరయ్యాక ఇక్కడే సెటిలవ్వాలన్నంత... లోయర్ సుబన్‌సిరి జిల్లాలో జరిగిన ఓ ర్యాలీని ఉద్దేశించి రాహుల్‌గాంధీ మంగళవారం మాట్లాడుతూ..
రిటైరయ్యాక ‘అపతని పీఠభూమి’గా ప్రసిద్ధి గాంచిన హపోలీలో స్థిరపడాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇంత అందమైన ప్రదేశాన్ని దేశంలో మరెక్కడా తాను చూడలేదని, ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు కొద్దిరోజులు ఇక్కడ గడపాలని భావిస్తున్నానని ఆయన చెప్పారు. బీజేపీ విభజన రాజకీయాలే దేశంలో లౌకిక అల్లికను నాశనం చేశాయని, విద్వేషపూరిత నేరాలను పెంచాయని రాహుల్ గాంధీ విమర్శించారు.