ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ ఛౌదరి (ఫైల్‌ఫోటో)
సాక్షి, లక్నో : 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలుగా వెలుగొందే ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ సహకరించాలని ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ చౌదురి సూచించారు. యూపీలోని కైరానా పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్‌పీ, బీఎస్‌పీలతో మద్దతుతో ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి గెలుపొందిన నేపథ్యంలో విపక్షాల ఐక్యతపై అంచనాలు ఊపందుకున్నాయి. నాలుగు ప్రధాన పార్టీలున్న యూపీలో సీట్ల సర్ధుబాటు సంక్లిష్ట సమస్యేనని జయంత్ అంగీకరించారు. బీజేపీని నిలువరించేందుకు అన్ని పార్టీలూ సర్ధుబాటు ధోరణితో వ్యవహరించాలన్నారు.
కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు దానికి సహకరించాలని పేర్కొన్నారు. ఈ ఫార్ములాతో బీజేపీని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నిలువరించవచ్చని సూచించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీయే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా భాగస్వామ్య పక్షాలు ఈ మార్గంలోనే ముందుకెళ్లాలని గుర్తెరగాలన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుతో ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్‌పీ కలిసి పోటేచేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment