భారత్‌కు రూ.14,250 కోట్ల జపాన్ రుణం | Rs .14,250 crore loan to India from Japan | Sakshi

భారత్‌కు రూ.14,250 కోట్ల జపాన్ రుణం

Apr 1 2016 1:11 AM | Updated on Sep 3 2017 8:57 PM

దేశంలోని ఐదు మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలకు సంబంధించి మొత్తం రూ. 14,250 కోట్ల రుణాలు ఇవ్వడానికి జపాన్ అంగీకరించింది.

న్యూఢిల్లీ: దేశంలోని ఐదు మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలకు సంబంధించి మొత్తం రూ. 14,250 కోట్ల రుణాలు ఇవ్వడానికి జపాన్ అంగీకరించింది. అధికారిక అభివృద్ధి సహాయం కింద(ఓడీఏ) ఈ రుణాలను ఇవ్వనుంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లో ప్రసార వ్యవస్థ అభివృద్ధికి (911.55 కోట్ల రూపాయలు), ఒడిశా సమీకృత పారిశుధ్య వ్యవస్థ పురోగతి ప్రాజెక్టుకు (1,516 కోట్లు), మొదటి దశ ప్రత్యేక రవాణా కారిడార్ ప్రాజెక్టుకు (రూ. 6,170 కోట్లు), అలాగే తూర్పు ఉత్తర రోడ్డు వ్యవస్థ అనుసంధాన ప్రాజెక్టుకు(రూ.3,959 కోట్లు), జార్ఖండ్ హార్టికల్చర్ మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు (రూ.274 కోట్లు) వెచ్చించనున్నారు.

ఈ రుణాలన్నీ జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ద్వారా ఇస్తారు. ఈ మేరకు భారత ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి సెల్వ కుమార్, భారత్‌లో జపాన్ రాయబారి కెంజి హిరమత్తులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement