కులాంతర వివాహానికి క్యాష్ బహుమతి | rs 50000 reward to couples opting for inter caste marriage | Sakshi
Sakshi News home page

కులాంతర వివాహానికి క్యాష్ బహుమతి

Published Tue, Jan 13 2015 5:48 PM | Last Updated on Thu, Jul 18 2019 2:21 PM

కులాంతర వివాహానికి క్యాష్ బహుమతి - Sakshi

కులాంతర వివాహానికి క్యాష్ బహుమతి

 కులాల మధ్య అంతరం తగ్గించేందుకు బీహార్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కులాంతర వివాహాలకు నజరానా ప్రకటించింది. ఈ విధంగా వివాహం చేసుకున్నజంటలో పెళ్లి కూతురు పేరు మీద ప్రభుత్వం రూ.50,000 డిపాజిట్ చేయనుంది.
 
వీరు పెళ్లి చేసుకున్న మూడేళ్ల తర్వాత కూడా కలిసుంటేనే ఆ సొమ్మును తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ మూడేళ్లలోపు ఆ జంట విడిపోతే ఈ సొమ్మును కోల్పోవలసి ఉంటుంది. విజయవంతంగా తమ మూడేళ్ల  వైవాహిక జీవితాన్నిపూర్తి చేసుకున్న తర్వాత ఈ జంట ఉమ్మడి అంగీకారంతోనే ఆ డబ్బు డ్రా చేయడం లేదా తర్వాతి కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement