సుదిప్తా సేన్
న్యూఢిల్లీ: శారద చిట్ ఫండ్ స్కామ్ కేసులో భాగంగా బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సుమారు 60 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్‌మెంట్ చేసింది. ఇందులో పశ్చిమబెంగాల్‌లోని లింకన్ హైస్కూలు, లాండ్‌మార్క్ సిమెంట్ పరిశ్రమ, పలు ఫ్లాట్‌లు, రిసార్ట్‌లు ఉన్నట్టు తెలిసింది.
శారదా గ్రూప్ చిట్ఫండ్ కంపెనీ చైర్మన్ సుదిప్తా సేన్, అతని బినామీ ఆస్తులను అటాచ్ చేశారు. మరోవైపు ఈ స్కామ్‌కు సంబంధించి ముంబైలో సెబీకి చెందిన పలువురు సీనియర్ అధికారులను సీబీఐ బుధవారం ప్రశ్నించింది.
**