‘రాహుల్‌ సందేశం విన్నా’ | Smriti Irani Responds To Rahul Gandhis Amethi With Love Message | Sakshi
Sakshi News home page

‘రాహుల్‌ సందేశం విన్నా’

Published Mon, May 27 2019 9:13 AM | Last Updated on Mon, May 27 2019 4:03 PM

Smriti Irani Responds To Rahul Gandhis Amethi With Love  Message - Sakshi

అమేథి : లోక్‌సభ ఎన్నికల్లో అమేథిలో ఓటమి  అనంతరం కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ చేసిన సూచనపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధికి చొరవ చూపాలని, అమేథిని జాగ్రత్తగా చూసుకోవాలని అక్కడి నుంచి గెలుపొందిన స్మృతి ఇరానీకి సూచించిన సంగతి తెలిసిందే. రాహుల్‌ సందేశాన్ని తాను గట్టిగా విన్నానని ఆమె దీటుగా బదులిచ్చారు. అమేథిలో తన సన్నిహితుడు సురేంద్ర సింగ్‌ను దుండగులు కాల్చిచంపిన క్రమంలో నియోజకవర్గాన్ని సందర్శించిన స్మృతి ఇరానీ రాహుల్‌ వ్యాఖ్యలపై స్పందించారు.

సురేంద్ర సింగ్‌ మరణంతో అమేథిలో ఎంతటి భయానక వాతావరణం నెలకొందో వెల్లడైందని, అతడిని హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడేలా తాను అవసరమైతే సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తానని ఆమె పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement