రూ 50,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ!
రూ 50,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ!
Published Thu, Sep 21 2017 8:10 PM | Last Updated on Mon, Aug 20 2018 4:55 PM
సాక్షి, న్యూఢిల్లీ : నిస్తేజంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు నింపేందుకు భారీ ప్యాకేజీని ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ద్రవ్య లోటును పూడ్చి మందగమనాన్ని అధిగమించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 కోట్లతో ఉద్దీపన ప్యాకేజీకి ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోందని సమాచారం.
ప్రైవేట్ పెట్టుబడులు ఆశించిన మేర లేకపోవడంతో ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ప్రభుత్వం సరైన సమయంలో తగిన చర్యలతో ముందుకు వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ సంస్థ ఏర్పాటు చేసిన ఇండియా ఇన్వెస్టర్ సదస్సులోనూ జైట్లీ ఉద్దీపన ప్యాకేజ్‌పై సంకేతాలు పంపారు. ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్యాకేజీపై సంప్రదింపులు జరిగినట్టు సమాచారం.
Advertisement
Advertisement