సహారా ఆస్తుల అమ్మకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ : సహారా గ్రూపు ఆస్తుల అమ్మకానికి సుప్రీం కోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెబీ ఓ కమిటీని నియమించి సంస్థ ఆస్తులను విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆస్తులను మార్కెట్ ధరలో 90 శాతానికి తక్కువ కాకుండా విక్రయించాలని సూచించింది. ఆ సంస్థకు చెందిన 86 ఆస్తులను కమిటీ పర్యవేక్షణలో అమ్మాలని పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి ఎన్ అగర్వాల్, సహారా నేతృత్వంలో ఆస్తుల విక్రయం వ్యవహారాలను నిర్వహించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా సహారా గ్రూపు సంస్థలు ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు వసూలు చేసి తిరిగి చెల్లింపులో తీవ్ర జాప్యం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన సుబ్రతా రాయ్‌కి బెయిల్ మంజూరు చేసేందుకు రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.