![Supreme Court To Hear Petitions Challenging Sabarimala Verdict - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/23/sabarimala.jpg.webp?itok=WOI1uhji)
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళల అనుమతిని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నవంబర్ 13న విచారించనుంది. జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం సహా 19మంది దాఖలుచేసిన రివ్యూ పిటిషన్లను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం... వాటిని నవంబర్ 13న విచారిస్తామని ప్రకటించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ఎస్కే కౌర్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ప్రస్తుతం శబరిమలలోని అయ్యప్ప ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని, ఈ అంశంపై సత్వరమే విచారణ చేపట్టాలని ఓ న్యాయవాది చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై 19 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపిన జస్టిస్ గొగోయ్.. ఈ వ్యాజ్యాలను నవంబర్ 13న విచారిస్తామని తెలిపారు.
శబరిమలలో మహిళల నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువడినప్పటి నుంచి శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించగా భక్తులు అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment