సాక్షి, ఆగ్రా: తాజ్‌మహల్‌తో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. బుధవారం రాత్రి భార్య డింపుల్‌యాదవ్, పిల్లలతో కలిసి ఆయన తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాజ్‌మహల్ ఓ అద్భుతం, షాజాహాన్ తన ప్రేయసి చిహ్నంగా కట్టిన గొప్ప కట్టడమని కొనియాడారు. ఎస్పీ అధికారంలో ఉండగా తాజ్‌మహాల్ చుట్టు పక్కల వ్యాపారాలు విస్తరించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు.
ఈ అద్భుత కట్టడం చరిత్రను వివరిస్తూ ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ఇక రాత్రి వేళల్లో తాజ్‌మహాల్ గొప్పతనం మరింత తెలుస్తుందన్నారు. ప్రపంచమంతా చీకటిగా ఉన్నా తాజ్‌మహాల్ మాత్రం తెల్లని పాలరాతి స్తంభాలతో మెరుస్తుందన్నారు. యూపీ పర్యాటక బుక్‌లెట్ నుంచి తాజ్‌మహల్‌ను తొలగించారన్న వార్తల నేపథ్యంలో అఖిలేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment