'తెలుగు రాష్ట్రాలకు రాయితీలు ఇవ్వవద్దు' | Tamil Nadu CM writes to Modi over tax concessions | Sakshi
Sakshi News home page

'తెలుగు రాష్ట్రాలకు రాయితీలు ఇవ్వవద్దు'

Published Mon, Aug 25 2014 6:40 PM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత

చెన్నై: పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రాలు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్లకు కొత్తగా రాయితీలు ఇవ్వవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని  కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. ప్రోత్సాహకాల పేరుతో ఆ రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఇస్తే పరిశ్రమలు, పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పునర్వ్యవస్థీకరణ చట్టంలో గణనీయమైన ఆర్థిక ప్యాకేజీ ఉందని ఆమె గుర్తు చేశారు. ఆ రెండు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఆ చట్టంలో ఉన్నాయని తెలిపారు. ఆ రాయితీలను రద్దు చేయాలని  జయలలిత ఆ లేఖలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement