
భోపాల్ : దొంగతనం చేసిందనే అనుమానాంతో.. తరగతి గదిలోనే విద్యార్థిని వివస్త్రను చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని దమోహ్ పాఠశాలలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. దమోహ్‌లోని రాణి దుర్గావతి హై స్కూల్లో పదో తరగతి బాలికల విభాగంలో దొంగతనం జరిగింది. ఒక బాలిక 70 రూపాయలను దొంగిలించిందనే అనుమానాన్ని బాధితురాలిపై తోటి విద్యార్థిని వ్యక్తం చేసింది. దీంతో మొదట బాధితురాలి పుస్తకాల బ్యాగును సోదా చేశారు. అందులో డబ్బులు దొరకకపోవడంతో.. బాధితురాలి బట్టలు విప్పించి వెదకమని టీచర్ చెప్పారు.
తరగతి గదిలో అందరిముందు జరిగిన అవమానాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు వివరించింది. ఆగ్రహించిన తల్లిందండ్రులు పాఠశాల యాజమాన్యానికి, జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన జిల్లా విద్యాశాఖాధికారులు.. పాఠశాలకు నోటీస్ జారీ చేయడంతో పాటు.. సంబంధిత టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment