అభ్యర్థి విద్యార్హత తెలుసుకోవడం ఓటరు హక్కు | That was Voter Right | Sakshi
Sakshi News home page

అభ్యర్థి విద్యార్హత తెలుసుకోవడం ఓటరు హక్కు

Published Wed, Nov 2 2016 3:13 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

That was Voter Right

న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల విద్యార్హతల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా నామినేషన్ పత్రాలు తిరస్కరించవచ్చని తెలిపింది. పోటీలో ఇద్దరే ఉండి,గెలిచిన అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పుడు వివరాలు ఉన్నాయని నిరూపితమైతే, ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యాయని ఓడిన అభ్యర్థి రుజువులు సమర్పించనక్కర్లేదనీ తెలిపింది.

మణిపూర్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ  పృథ్వీరాజ్, శరత్‌చంద్ర పరస్పరం వేసుకున్న దావాలను కోర్టు విచారించింది. 2012 ఎన్నికల్లో నామినేషన్ పత్రాల్లో తన విద్యార్హత ఎంబీఏ అని తప్పుగా పేర్కొని విజయం సాధించిన పృథ్వీరాజ్ ఎన్నిక చెల్లదని మణిపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును ఇప్పుడు సుప్రీంకోర్టు సమర్థించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement